చార్మికి మరో బాలీవుడ్ ఆఫర్
వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్, హర్షద్ వర్సి ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న 'జిల్లా ఘజియాబాద్' చిత్రంలో చార్మికూడా నటించబోతోంది. మనీషా లాంబ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఆనంద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ బచ్చన్ నిర్మిస్తున్నారు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ చిత్రం షూటింగ్ సాగుతూనే ఉంది. చార్మికి అవకాశం అయితే దక్కింది కానీ ఈచిత్రం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో..!
మరో వైపు చార్మి తెలుగులో ఓ చిత్రంలో ఆమె వేశ్యగా కనిపించబోతోంది. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు ఈ సినిమాకు దర్శకుడు. బేబి హ్యాపీ సమర్పణలో డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఒక వేశ్యకు, రచయితకు, సింగర్‌కు మధ్య జరిగే కథ. ఇంతకు మించి తెలుగులో ఈ మధ్య చార్మికి పెద్దగా అకాశాలు రావడం లేదనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆమె మళయాలంలో 'తప్పన' అనే చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications












