twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం ఆ డైరక్టర్ ఊకలో ఈక

    By Staff
    |

    Kavyas Dairy
    మంజుల, ఛార్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన కావ్యాస్ డైరీ చిత్రాన్ని లైట్ బోయ్ కూడా డైరక్ట్ చేసారని నిర్మాత మంజులు మీడియా మీట్ లో చెప్పుకొచ్చారు. అయితే ఆ విషయాన్ని ఆమె చాలా పొజిటివ్ గా చెప్పారు. దర్శకుడు వి.కె.ప్రకాష్ ప్రతీ ఒక్కరికీ భావ ప్రకటనా స్వేఛ్చ ఇచ్చేవారిని, ఎవరి సలహానైనా స్వీకరించేవారని చెప్పుకొచ్చింది. అందుకే తమ ప్రాజెక్టు చాలా బాగా వచ్చిందని చెప్పింది. అలాగే ఈ చిత్రంలో ఛార్మి చేసే నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర అధ్బుతంగా పేలుతుందని, సినిమా రిలీజయ్యాక ఈ పాత్ర తమ డ్రీమ్ రోల్ అని అందరూ చెప్తారని ఆమె కాస్త ఎక్కువ చేసి చెప్పారు. ఇక ఇప్పటికే ఎన్నో మార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ చిత్రం కొనుక్కొవటానికి బయ్యర్లు ఎవరూ రాలేదని ట్రేడ్ లో టాక్.

    అలాగే ఈ సినిమా హాలీవుడ్ హిట్ పోయిజన్ ఐవి అనే చిత్రంకు ఫ్రీమేక్ అనే వార్తలు మరో ప్రక్క గుప్పుమంటున్నాయి. మంజుల తన షో సినిమా అనంతరం ఇందిరా ప్రొడక్షన్స్ పై రూపొందిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. శ్యామ్ కె.దత్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకు వి.కె.ప్రకాష్ డైరక్షన్ చేస్తుండగా..మను సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఛార్మి, మంజుల లీడ్ రోల్స్ లో కనపడతారు. మంజుల భర్తని చంపటానికి, ఛార్మి ఆమె ఇంట్లో దిగుతుంది.

    ఎందుకిలా అంటే మంజుల భర్త వల్ల ఛార్మి కుటుంబం దెబ్బతింటుంది. మంజుల భర్తగా ఇంద్రజిత్ అనే మళయాళ నటుడు చేస్తున్నాడు. అలా ఛార్మి పగ తీర్చుకునే పాత్రలో కనిపించి మురిపించనున్నదని తెలుస్తోంది. ఇక వీరిద్దరకీ జంటగా ఇంద్రజిత్, శశాంక్ కనిపించనున్నారు. అయితే సినిమా పూర్తయి చాలా రోజులైనా రిలీజ్ కావటం లేదు. ఇప్పటికి మూడు సార్లు విడుదల వాయిదా పడింది. అలాగే ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఛార్మికీ, మంజులకీ పడలేదని వార్తలు వచ్చాయి. ప్రతీ విషయంలోనూ ఛార్మి వేలు పెట్టేదని మంజుల కోపపడిందని చెప్పుకున్నారు. దాంతో దర్శకుడుకి స్వేచ్చ లేకుండా పోయిందని వినపడింది. అయితే ఇప్పుడు మంజుల తమ సినిమాను లైట్ బోయ్ కూడా డైరక్ట్ చేసారని చెప్పి పూర్తిగా కరివేపాకులా తీసిపారేస్తోందని అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X