twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్మీ ఇంట్లో విషాదం.. అదే చివరి కాల్ అనుకోలేదంటూ ఎమోషనల్

    |

    హీరోయిన్‌‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది ఛార్మీ. హీరోయిన్‌గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఛార్మీ.. నిర్మాతగా మారింది. ఆ మధ్య కొన్ని చిత్రాలు బెడిసికొట్టడంతో పూరి జగన్నాద్ గ్యాంగ్‌లో చేరి నిర్మాతగా మారింది. ప్రస్తుతం పూరి కనెక్ట్స్ బ్యానర్‌ వ్యవహారాలన్నీ నిర్వహిస్తోంది.

     ఇస్మార్ట్‌తో సక్సెస్..

    ఇస్మార్ట్‌తో సక్సెస్..

    పూరీ కనెక్ట్స్ మీద తెరకెక్కించిన సినిమాలన్నీ బెడిసి కొడుతున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ ఊపిరి పోసింది. బ్లాక్ బస్టర్ హిట్ కావడం, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడంతో ఛార్మీ, పూరీలకు మంచి విజయం దక్కినట్టైంది. అందుకే ఇస్మార్ట్ భరోసాతో ప్యాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు.

    ఫ్యామిలీతో సరదగా..

    ఫ్యామిలీతో సరదగా..

    ఛార్మీ తన ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. ఆ మధ్య వారి ఇంట్లో బుల్లి వారసుడు వస్తే అందరూ ఒక్కచోటే కలిసి ఎంజాయ్ చేశారు. ఛార్మీ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

     లేరనే మాటే ఒప్పుకోను..

    లేరనే మాటే ఒప్పుకోను..

    తాజాగా ఛార్మీ తనకెంతో ఇష్టమైనవారు చనిపోవడంతో ఎమోషనల్ అయింది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ‘ఇక లేరు అనే మాటే వినడానికి నాకు నచ్చదు.. కానీ జీవితంలో జరిగేది జరగక మానదు.. నిన్ననే మనం చివరగా వీడియో కాల్ మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నాను.

    Recommended Video

    Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
    ఆత్మకు శాంతి..

    ఆత్మకు శాంతి..

    పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతూ ఉంటాను. నీ లోటు భర్తీ చేయలేనిది.. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాల'ని ఛార్మీ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఛార్మీ ఫైటర్ పనుల్లో బిజీగా ఉంది.

    English summary
    Charmme kaur About Her Aunt Demise. “NO MORE “ is something I can never accept , but life has its own decisions to take ..yesterday your last video call to me , I never thought that would be our last video call ever ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X