Don't Miss!
- News టీడీపీ హ్యాట్రిక్ కు వైసీపీ యువనేత బ్రేకులు వేస్తారా..!!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్‌కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఛార్మీ ఇంట్లో విషాదం.. అదే చివరి కాల్ అనుకోలేదంటూ ఎమోషనల్
హీరోయిన్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది ఛార్మీ. హీరోయిన్గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఛార్మీ.. నిర్మాతగా మారింది. ఆ మధ్య కొన్ని చిత్రాలు బెడిసికొట్టడంతో పూరి జగన్నాద్ గ్యాంగ్‌లో చేరి నిర్మాతగా మారింది. ప్రస్తుతం పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ నిర్వహిస్తోంది.
ఇస్మార్ట్‌తో సక్సెస్..
పూరీ కనెక్ట్స్ మీద తెరకెక్కించిన సినిమాలన్నీ బెడిసి కొడుతున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ ఊపిరి పోసింది. బ్లాక్ బస్టర్ హిట్ కావడం, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడంతో ఛార్మీ, పూరీలకు మంచి విజయం దక్కినట్టైంది. అందుకే ఇస్మార్ట్ భరోసాతో ప్యాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు.
ఫ్యామిలీతో సరదగా..
ఛార్మీ తన ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. ఆ మధ్య వారి ఇంట్లో బుల్లి వారసుడు వస్తే అందరూ ఒక్కచోటే కలిసి ఎంజాయ్ చేశారు. ఛార్మీ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
లేరనే మాటే ఒప్పుకోను..
తాజాగా ఛార్మీ తనకెంతో ఇష్టమైనవారు చనిపోవడంతో ఎమోషనల్ అయింది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ‘ఇక లేరు అనే మాటే వినడానికి నాకు నచ్చదు.. కానీ జీవితంలో జరిగేది జరగక మానదు.. నిన్ననే మనం చివరగా వీడియో కాల్ మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నాను.
Recommended Video
ఆత్మకు శాంతి..
పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతూ ఉంటాను. నీ లోటు భర్తీ చేయలేనిది.. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాల'ని ఛార్మీ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఛార్మీ ఫైటర్ పనుల్లో బిజీగా ఉంది.