twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్‌కు డై హార్డ్ ఫ్యాన్.. హీరోపై ఛార్మీ కామెంట్

    |

    టాలీవుడ్‌లోని అతి కొద్ది యువ హీరోల్లో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా సరే సత్యదేవ్ తనదైన శైలిలో రక్తికట్టించగలడు. జ్యోతిలక్ష్మీ, బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో ఇలా ప్రతీ సినిమాలో తన మార్క్‌ను చూపెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో వెబ్ సిరీస్‌లోనూ అడుగు పెట్టాడు.

    నేడు (జూలై 4) సత్యదేవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సత్యదేవ్‌కు టాలీవుడ్ ప్రముఖులంతా విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఛార్మీ ప్రత్యేకంగా సర్ ప్రైజ్ చేస్తూ విష్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో సత్యదేవ్ దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నేను ఈ ఫోటోను తీస్తున్న సమయంలో నీ కళ్లలోని మెరుపు నాకు ఇంకా గుర్తుంది.. మెగాస్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్‌వి నువ్.. నువ్వింకా ఎంతో ఎత్తుకు ఎదగాలి..హ్యాపీ బర్త్ డే సత్య' అని ట్వీట్ చేసింది.

    Charmme kaur Special Wishes To Satya Dev

    ఛార్మీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు సత్యదేవ్ ఎంతో సంతోషపడ్డాడని తెలుస్తోంది. ఈ మేరకు సత్యదేవ్ ట్వీట్ చేస్తూ.. 'ఛార్మీ.. ఈ ఫోటోను షేర్ చేసినందుకు, తీసినందుకు కేవలం నీకు థ్యాంక్స్ చెబితే సరిపోదు.. ఇది నాకొక అద్భుత క్షణం. ఎల్లప్పుడూ నా వెంటే ఉంటున్నందుకు థ్యాంక్స్' అని చెప్పుకొచ్చాడు. సత్యదేవ్ రీసెంట్‌గా 47డేస్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. సత్యదేవ్ నటనకు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఇక సత్యదేశ్ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో మరోసారి కట్టిపడేసేందుకు సిద్దంగా ఉన్నాడు.

    English summary
    Charmme kaur Special Wishes To Satya Dev. I still remember that glitter in ur eyes when I was clicking this pic for u Face with tears of joy You Being a crazy Die hard mega star fan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X