ఖండించిన పూరి జగన్నాథ్..అసలు నిజం ఇదీ
హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేయాలన్న చార్మి కల త్వరలో నెరవేరనున్న సంగతి తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మి' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం అప్పట్లో చిన్నా,పెద్దా తేడా లేకుండా ఉర్రూతలూగించిన నటి జ్యోతిలక్ష్మి జీవిత కథతో ఈ సినిమా రూపొందనుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పూరి ఖండించారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... -‘‘అస్సలు కాదు. జ్యోతిలక్ష్మిగారికీ దీనికీ ఏమాత్రం సంబంధం లేదు. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా నేనీ సినిమా చేయబోతున్నా. అసలు నా తొలి చిత్రంగా దీన్ని చేయాలనుకున్నా. ఇన్నేళ్ళకు కుదిరింది'' అని తెలిపారు.

ఈ చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘రోమియో' చిత్రానికి సంగీతం సమకూర్చిన సునీల్ కశ్యప్ ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం ఛార్మికి తెలుగులో ఆపర్స్ సైతం ఏమీ లేవు. హిందీలో అయినా సెటిల్ అవుదామనుకున్న ఆమె ఆసలు అక్కడ పెద్దగా ఆఫర్స్ రాకపోవటంలో చాలా నిరాశలో పడిపోయింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు ఏమీ గత రెండేళ్లుగా ఆడలేదు. అన్నీ డిజాస్టర్స్ అయ్యీయి. కొన్ని సినిమాలు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి.
ప్రస్తుతం ఆమె నటిస్తున్న మంత్ర-2 విషయానికొస్తే..ఈ చిత్రానికి ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.రవికుమార్‌రెడ్డి సమర్పణలో పి.శౌరీరెడ్డి, వి.యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ...20 రోజులపాటు నిరవధికంగా రాత్రి సమయాల్లో షూటింగ్ చేశామని, హీరోయిన్ ఛార్మి అందిస్తున్న సహకారం మరువలేమని అన్నారు. సంగీత దర్శకుడు చక్రి అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని చేయడం ఆనందంగా వుందని, ఇంతవరకూ ఇలాంటి సబ్జెక్ట్‌తో ఎవరూ టచ్ చేయలేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











