ఆ భయమేనా?...రాత్రి పూట వద్దంటున్న చార్మి!
హైదరాబాద్: సినిమా పరిశ్రమలో పనివేళలకు సమయం అనేది ఉండదు. సినిమాలోని సన్నివేశాలను బట్టి పగలు, రాత్రి తేడా లేకుండా షూటింగులు జరుగడం మామూలే. అయితే హీరోయిన్ చార్మి మాత్రం రాత్రి పూట షూటింగులు ఉండొద్దని కోరుకుంటోంది. వీలైనంత వరకు రాత్రి పూట షూటింగులకు దూరంగా ఉండాలనే భావిస్తోంది.
గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లనే ఆమె రాత్రి పూట షూటింగుల్లో పాల్గొనేందుకు భయ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి రాత్రి చార్మికి ఎలాంటి? సంఘటనలు ఎదురయ్యాయో? అవి బయటికి చెప్పుకోలేని సంఘటనలా? అంటూ ఫిల్మ్ నగర్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం చార్మి 'మంత్ర 2' చిత్రంలో నటిస్తోంది. ఇది హారర్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఎక్కువగా రాత్రి పూట షూటింగులే ఉన్నాయట. రాత్రి పూట షూటింగుల్లో పాల్గొనడం ఇష్టం లేక పోయినా.....స్క్రిప్టు డిమాండు మేరకు తప్పడం లేదట. వీలైనంత వరకు రాత్రి పూట షూటింగులు వద్దని దర్శక నిర్మాతలకు చెబుతోందట.
మంత్రి 2 సినిమా విషయానికొస్తే...ఎస్.వి.సతీష్ దర్శకత్వంలో తేజ ఫిలింస్ పతాకంపై బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ 'మంత్ర-2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు అనుక్షణం ఉత్కంఠ కల్గించేలా హారర్, సస్పెన్స్‌తో సినిమా తెరకెక్కుతోంది. రఘుబాబు, హేమ, తా.రమేష్, రావూ రమేష్, సన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఆర్.పి.తనికెళ్ల, ఎడిటింగ్:సిద్దంసెట్టి బా బు, నిర్మాతలు:బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ, దర్శకత్వం:ఎస్.వి.సతీష్.


Click it and Unblock the Notifications












