twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్మి '16 డేస్' ఏమైంది?

    By Staff
    |

    Charmi
    ఛార్మి, అరవింద్ (కొత్త కుర్రాడు) జంటగా ప్రభు సాల్మన్ అనే తమిళ దర్శకుడు రూపొందించిన సిక్సీన్ డేస్ చిత్రం నిన్న మార్నింగ్ షో తో రిలీజ్ అయింది. అయితే సినిమా పబ్లిసిటీలో హైప్ చేసినంత సీన్ సినిమాలో లేదని ప్రేక్షకులు పెదివి విరుస్తున్నారు. మూడేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ ధ్రిల్లర్ లక్కీ నెంబర్ స్లెవన్ కి అనుకరణగా వచ్చిన ఈ సినిమాలో రివేంజ్ ఎలిమెంట్ తీసేసి రెండు గ్యాంగులు మధ్య ఇరుక్కున్న ఓ అమాయికుడు కథగా తీర్చిదిద్దారు. అలాగే కథ, కథన లోపాలే సినిమాను బోరి్ గా తయారు చేసాయి.

    లోకల్ డాన్ యాదగిరి(కోట)తన రైవల్ రామిరెడ్డితో జరిగిన గొడవలో కొడుకుని కోల్పోతాడు. దాంతో యాదగిరి...తన కుమారుడు కర్మ కాండలు పూర్తయ్యే (పదహారు రోజులు) లోపల రామిరెడ్డి కుమారుడుని లేపాయాలని శపధం చేస్తాడు. అందుకోసం ప్రక్క రాష్ట్రాల నుంచి చాలామంది ప్రొపిషనల్ కిల్లర్స్ ని హైర్ చేస్తాడు. అయితే రామిరెడ్డి అలా వచ్చిన వారందరని చంపేస్తూంటాడు. అప్పుడు యాదగిరి మనుషులు గుత్తి గురుమూర్తి(అరవింద్)అనే కుర్రాడుని తీసుకొస్తారు. మూర్తి..ప్రెష్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్ ఉద్యోగం కోసం వచ్చి ఆ వేటలో ఉంటాడు. వాస్తవానికి వాళ్ళు గురుమూర్తి అన్నయ్య కోసం వచ్చి పొరపాటున ఈ తమ్ముడిని ఎత్తుకుపోతారు.

    అక్కడే యాదగిరి పగ గురించి తెలుసుకున్న గురుమూర్తి తెలివిగా అతని నుంచి బయట పడేందుకు తనకు తోచించి చెపుతాడు. అయితే ఆ ఐడియా యాదగిరికి నచ్చటంతో రామిరెడ్డి కొడుకును చంపే పని గురుమూర్తి నెత్తిన పెడతాడు. అంతేగా చంపకుంటే నిన్నే లేపేస్తామని యాదగిరి వార్నింగ్ ఇస్తాడు.అలా ఇరుక్కున్న గురుమూర్తి తిరిగి ఇంటికి వస్తుండగా రామిరెడ్డి మనుషులకు దొరుకుతాడు. వాళ్లు అతన్ని సజీవంగా ఓ గోతిలో పాతిపెట్టేస్తారు. ఆ స్ధితిలో గురుమూర్తి బయటపడి ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఏంజెల్ (ఛార్మి) పరిచయమవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేస్తున్న ఏంజిల్ కి తన స్టోరీ చెప్పి ఆమెకు దగ్గరవుతారు. ఈ లోగా 16 రోజుల డెడ్ లైన్ ఐపోతుంది. ఇక గురుమూర్తి ఆ ఇద్దరి నుంచీ ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.

    ఇక మంత్ర, అనుకోకుండా ఒకరోజు చిత్రాల్లా ఛార్మి చుట్టూ కథ తిరగదు. అలాగే ఛార్మి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోల వాయిస్ లను ఇమిటేట్ చేస్తూంటుంది. అయితే అది చాలా ఇరిటేటింగా ఉంటుంది. అలాగే ఆ పాత్ర కూడా ఓ కొరియా సినిమానుండి దిగుమతి చేసుకుందే . సెకెండాఫ్ సహనానికి పరీక్షగా మారటం ఈ సినిమాకు మైనస్ గా మారింది. పబ్లిసిటీతో ధియోటర్లలో లాండ్ అయిన వారి మౌత్ టాక్ పై ఈ సినిమా విజయం ఆధారపడింది. చివరకు ఆ పదహారు రోజులైనా నడవటం కష్టమే అనిపిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X