twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాబోయేవాడికి అది కాస్త ఉండాలి: ఛార్మి

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాక్కొంచెం తిక్కుంది. కాబోయేవాడికి కూడా అది కాస్త ఉండాలి అంటోంది ఛార్మి. తనను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నదానికి ఇలా చెప్పుకొచ్చింది. అలాగే నన్ను అర్థం చేసుకొంటే ఎదుటివాళ్లకు బాగా నచ్చుతాను, లేదంటే మాత్రం పెద్ద నసలా అనిపిస్తాను. అందుకే నన్ను బాగా అర్థం చేసుకొనేవాడు దొరికే వరకూ ఎదురు చూడాలనుకొంటున్నా అంది.

    అలాగే ఇప్పటి వరకూ అయితే పెళ్లి ఆలోచన రాలేదు. అయినా నా వయసెంతండీ? ఇంకా కొన్ని రోజులు అమ్మానాన్నల మధ్య హాయిగా గడుపుతా. అయినా నా నిర్ణయాలు చాలా అనూహ్యంగా ఉంటాయి. ఆ క్షణం నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాను. ఓ గంట తరవాత పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ఆ ప్రయత్నం మొదలుపెడతానంతే అంది.

    తన వయస్సు గురించి చెప్తూ...వయసు దాచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. శుక్రవారంతో పాతికేళ్లు పూర్తవుతాయి. పదమూడేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. పన్నెండేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాను. ఇప్పటిదాకా వయసుకు మించిన పాత్రల్లో నటించాను. రేపట్నుంచి నాకు తగ్గ పాత్రల్లోనే నేను కనిపించబోతున్నాను అంది.

    తొలినాళ్లల్లో అందంతో ఆకట్టుకొన్న ఈ ముద్దుగుమ్మ... ఆ తరవాత అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. 'మంత్ర', 'మంగళ' చిత్రాలతో కథానాయిక ప్రాధాన్యమున్న కథలకి చిరునామాగా నిలిచింది. ఇటీవల 'ప్రేమ ఒక మైకం' అనే చిత్రంలో వేశ్యగా నటించింది. ఆ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తుంది. శుక్రవారం ఛార్మి జన్మదినం. ధట్స్ తెలుగు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.

    English summary
    Charmy celebrating her birthday today with her Family and Friends. In an interview Charmy shares her views about Marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X