Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఛార్మిని మళ్ళీ చేరదీసాడు
వరస ప్లాప్ లలో ఉన్న ఛార్మికి తిరిగి కెరీర్ నిలబెట్టడానికి కృష్ణవంశి పూనుకున్నాడని సమాచారం. ఆయన లేటెస్ట్ గా కమిటయిన బెల్లంకొండ సురేష్ చిత్రంలో ఛార్మిని హీరోయిన్ గా తీసుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రవితేజ హీరోగా చేసే ఈ చిత్రంలో ఆమెకు రోల్ ఇచ్చి తిరిగి గ్లామర్ గర్ల్ గా నిలబెడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటి నుంచీ ఛార్మిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న కృష్ణవంశి హీరోయిన్ ఓరియెంటడ్ రోల్స్ అంటూ పెద్ద ఛాన్స్ లు మిస్ చేసుకున్నావంటూ చెప్పి ఈ పాత్ర ఆఫర్ చేసారని తెలుస్తోంది.
అందులోనూ ఎన్నో ఆశలు పెట్టుకున్న కావ్యాస్ డైరీ సైతం భాక్సాఫీస్ వద్ద ఏ విధమైన ప్రభావం చూపకపోవటం ఆమెను పూర్తి స్దాయి డిప్రెషన్ లోకి తోసిందని చెప్తున్నారు. అయితే మొదట రవితేజ..చార్మి అనగానే ఒప్పుకోలేదని వినపడింది. అయితే ఛార్మి సైతం డైటింగ్ పాటించి తిరిగి పాత ఛార్మిగా చిక్కుతానని హామీ ఇచ్చిన తర్వాతే ఎగ్రిమెంట్ జరుగుతుందని కృష్ణవంశి సీరియస్ చెప్పారని తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ చిత్రం కంటెన్యూ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుని దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.