ఏ టైమ్‌లో పుట్టావమ్మా సమంత! నీ జాతకం.. ఛార్మి సెన్సేషనల్ కామెంట్స్

Recommended Video

Charmy Sensational Tweet On Samantha Goes Viral || Filmibeat Telugu

సమంత స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ప్రేక్షకుల్లో సమంతకు మంచి క్రేజ్ ఉంది. పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈమెకు అక్కినేని కోడలయ్యాక అన్నీ కలిసొస్తున్నాయి. నాగచైతన్యను పెళ్లాడాక వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది సమంత. అయితే తాజాగా సమంతపై ఛార్మి చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. ఛార్మి కామెంట్స్‌పై సమంత కూడా రియాక్ట్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం..

సమంత ఖాతాలో మరొకటి

సమంత ఖాతాలో మరొకటి

సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మంచి ట్రాక్ రికార్డ్ మెయిన్‌టైన్ చేస్తున్న సమంత తాజాగా ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జులై 5 న విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. చిత్రంలో సమంత, సీనియర్ నటి లక్ష్మి నటన చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. ఓ బేబీ సినిమా సమంత కెరీర్‌లో ఓ మైలురాయి లాంటి సినిమా అనే జనాల్లో వచ్చేసింది.

సమంతపై ఛార్మి కామెంట్స్

అయితే ఓ బేబీ సినిమా చూసిన చార్మింగ్ బ్యూటీ ఛార్మి.. సమంతను ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ''ఏ టైమ్ లో పుట్టవమ్మా నువ్వు.. నీ హార్డ్ వర్క్, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం. సమంత, ఓ బేబీ రాక్స్.. ఎంతో హ్యాపీగా ఉంది. డైరెక్టర్ నందిని రెడ్డి, ఓ బేబీ టీం మొత్తానికి శుభాకాంక్షలు'' అని ట్వీట్ పెట్టింది ఛార్మి.

వెంటనే రియాక్ట్ అయిన సామ్.. ఏమందో చూడండి

ఛార్మి ఏ ఉద్దేశంగా ఆ ట్వీట్ పెట్టిందో అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. సమంత టేకప్ చేస్తున్న ప్రాజెక్టులు గ్రేట్ అని, అలాగే ఆమెకు జాతకం కూడా బాగా కలిసొస్తుందని ఛార్మి ఉద్దేశం. దీంతో ఈ ట్వీట్ చూసిన సామ్.. వెంటనే రియాక్ట్ అవుతూ ''యువర్ ద క్యుటేస్ట్.. థాంక్యూ ఛార్మి.. లాట్ ఆఫ్ హగ్స్ అండ్ కిస్సెస్'' అంటూ మెసేజ్ పెట్టింది. వీరిద్దరి ఈ సంభాషణ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా

నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా

వెండితెరపై అందాల తారగా కీర్తించబడిన ఛార్మి.. ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా రాణిస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ అవుతోంది. ఈ మేరకు పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించిన కొత్త సినిమా ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓ బేబీ మూవీ

ఓ బేబీ మూవీ

సమంత లీడ్ రోల్‌లో నటించిన ఓ బేబీ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. చిత్రంలో లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. 63 ఏళ్ళ యువతి లక్షణాలతో 24 ఏళ్ల పడుచు పిల్లలా సమంత నటించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X