గతేడాది ఇదే సమయానికి.. గోవాలో గట్టిగా పార్టీ చేసుకున్నాం.. రామ్ బర్త్‌డేపై ఛార్మీ కామెంట్స్
ఎనర్జిటిక్ స్టార్, ఇస్మార్ట్ హీరో, ఉస్తాద్ రామ్ పుట్టిన రోజు నేడు (మే 15). ఈ మేరకు రెండు మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. తన పుట్టిన రోజు వేడుకలను ఎవ్వరూ సెలెబ్రేట్ చేయకూడదని, అందరూ ఇంటి పట్టునే ఉండాలని రామ్ తన ఫ్యాన్స్‌ను కోరుతూ ఓ లేఖను విడుదల చేశాడు. ఇక రామ్ బర్త్ డే కామన్ డీపీ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన డించక్ పాట కూడా తెగ వైరల్ అవుతోంది. రామ్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ తారలంతా విషెస్ చెబుతున్నారు.

నా ఎనర్జీ, నా ప్రాణం,..
‘మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టిన రోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో.. అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. ప్రస్తుతం చోటుచేసుకొన్న పరిస్థితుల రీత్యా.. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరు నా సంతోషం, నా ఎనర్జీ, నా ప్రాణం, అంతకు మించి నా బాధ్యత' అని పేర్కొన్నాడు.

కామన్ డీపీ వైరల్..
సెలెబ్రిటీల బర్త్‌డేలు, ప్రత్యేక సందర్భాల్లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కామన్ డీపీ అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ బర్త్ డే కామన్ డీపీని పీసీ కనెక్ట్స్, పూరీ, ఛార్మీ వంటి వారంతా కలిసి విడుదల చేశారు. శ్రీ విష్ణు, గోపిచంద్ మలినేని, నిధి అగర్వాల్, సురేష్ ప్రొడక్షన్స్, హరీష్ శంకర్ వంటి వారంతా కామన్ డీపీ సూపర్ ఉందంటూ స్పందించారు.

మరో మాస్ బీట్..
ఇస్మార్ట్ శంకర్‌కు మణిశర్మ అందించిన సంగీతం ఎంతగా ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా RED చిత్రంలోని మాస్ బీట్ డించక్ అనే పాటను విడుదల చేయడంతో రామ్ బర్త్ డే సంబరాలు మొదయ్యాయి. నేటి ఉదయం పది గంటలకు విడుదల చేసిన డించక్ పాటలో మణి శర్మ బీట్, రామ్ స్టెప్స్, హెబ్బా పటేల్ అందాలు హైలెట్‌గా నిలిచాయి.

గోవాలో గట్టిగా పార్టీ..
రామ్ బర్త్ డే సందర్భంగా ఛార్మీ విషెస్ చెబుతూ.. గతేడాదిని గుర్తు చేసుకుంది. ‘ఉస్తాద్ రామ్.. గతేడాది ఇదే సమయానికి జిందాబాద్ పాట షూటింగ్ కోసమని మనం గోవాలో ఉన్నాము.. గట్టిగా పార్టీ చేసుకున్నామ్.. నీ ఎనర్జీని, ప్రేమను మిస్ అవుతున్నా.. లాక్ డౌన్ తరువాత నిన్ను కలవాలి..హ్యాపీ బర్త్ డే రాపో' అని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











