ఛార్మికి 'మంత్ర' సినిమాకై ఉత్తమ నటిగా నంది పురస్కారానికి సెలక్టయిందన్న సంగతి తెలిసిందే. అయితే అదే స్టేజిపై ఆమె గాడ్ ఫాదర్ (ఛార్మే చెప్పుకుంటూటుంది)కృష్ణవంశి కూడా చందమామ చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా నందిని అందుకోనున్నాడు. దాంతో ఆమె సంతోషానికి అవధులు లేవని తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా వీళ్ళద్దరి రిలేషన్ పై రకరకాల వార్తలు వచ్చాయి. అలాగే రమ్యకృష్ణ తన భర్తను ఛార్మి కొంగుకు కట్టుకుంటోందని అలిగి మరీ వెళ్ళిపోయిందని కూడా వినపడ్డాయి. అయితే ఇద్దరూ మీడియా దగ్గర అదేం లేదని ఐదారు సార్లు కొట్టిపారేశారు కూడా. అయితే ఇప్పుడు ఇద్దరికి నంది రావటంపై వాళ్ళద్దరు ఆనందంగా స్పందించంపై ఆమెకు కాలుతోందని అంటున్నారు. ఎందుకంత బాధ గాడ్ ఫాదర్ అనే కదా చార్మి చెప్తోంది..ఫాదర్ తో ఎలా ఉంటే ఏంటి..బాధపడాల్సిన పనేముంది అంటూ సముదాయిస్తున్నారట శ్రేయాభిలాషులు.