హాట్ బ్యూటి ఛార్మి..నాగచైతన్య తాజా చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తోందని వినికిడి. ఓ పాటలో సైతం అదరొడ్తూ ఆమె టీవీ సీరియల్ హీరోయిన్ గా కనపడుతుందని వార్తలు వినపడుతున్నాయి. ఆ క్రమంలో ఆమె మన హారో వెనకపడుతూ పదే పదే పెళ్ళి చేసుకోమంటూ అడుగుతుందిట. అంతగా పెళ్ళి కుదరకపోతే పోనీ డేటింగ్ అయినా చేయమనే అల్లరి పిల్ల పాత్ర అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఆ పాత్రని చూడగానే నాగచైతన్య పారిపోతూండని,టార్చర్ పెడ్తుందని చెప్పి తప్పించుకుంటాడని అంటున్నారు. ఇంతకుముందు చిత్రాల్లో హీరో,ఇద్దరు హీరోయిన్స్ ఫార్మెట్ ఈ సినిమా అనుసరిస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాధ కూతురు పరిచయమవుతోంది. యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన కథనంతో వాసు వర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నారు.