twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చార్మీ పీల మొహం వేసిందెప్పుడు

    By Staff
    |

    సాధారణంగా ప్రజలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ప్లస్ లు మైనస్ లనేటివుంటాయి. మన దక్షిణాంద్రాలో సినిమా హీరోలన్నా, హీరోయిన్స్ అన్నా, సినిమాలన్నా అభిమానుకు పిచ్చి ప్రేమ. అంతటితో సరిపెట్టుకోక ఎక్కడికైనా సినిమా నటీనటులు కానీ, వారికి సంబందించిన ఫంక్షన్లు కానీ జరుగుతున్నాయని తెలిస్తే చాలు, జనాలు బారులు తీరి వుంటారు. అది వారి అభిమానం ఓక ఎతైతే మరి హజరైన వారికి నటినటులకు ప్రేక్షకాభిమానులపై అభిమానం, ఔత్సుకతా వున్నా ఒక ప్రక్క గుండెల్లో రైల్లు పరుగెడుతుంటాయి ఎందుకంటే ఆ పిచ్చి అభిమానం శృతిమించితే ఏ క్షణాన ఎవరికి ఏంజరుగుతుందో తమకేమవుతుందోనని.

    ఇలాంటి సంఘటనలను అప్పుడప్పుడు సినిమా నటీనటులు ఎదుర్కొంటుంటారు. షోరూం నిర్వాహకులు, ఇతర ఇండస్ట్రీ వారు తమ పబ్లిసిటీ చాటుకోవడానికి, నటీనటులను ముఖ్య అథిదిలుగా ఆహానిస్తుంటారు. రిబ్బన్ కట్ చేస్తే లక్షలొస్తాయాని ఆశపడితే, డబ్బులు, సినిమా సంగతెలా వున్నా ఆ కార్యక్రమం ముగించటం చాలా కష్టం. అన్నట్టు ఈ మద్య ఓ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఛార్మికి ఈ వింత అనుభవం ఎదురయ్యింది. చార్మి వంటి మీదవన్నీ దొబ్బేశారట. తనను చూనేందుకు బారులు తీరిన జనాన్ని చూసిన ఛార్మి ఉప్పొంగిపోతోంటే, ఆ పిచ్చి అభిమానం శృతిమించి ఏకంగా తన వస్తువుల్నే కాజేసేలా తయారయ్యింది.

    ఆ సమయంలో ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న ఛార్మి పీల మొహం వేసింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఛార్మిని అక్కడినుంచి సేఫ్ ప్లేస్ కి తరలించినా ఇంతలో కొందరు దుర్మాగులు ఛార్మికి సంబంధించిన కొన్ని వస్తువుల్ని మరియు వంటిమీద ఆభరణాలని కూడా కొల్లగొట్టేశారట. అయితే ఛార్మి మాత్రం పోగొట్టుకొన్న వస్తువుల గురించి నోరు మెదపకపోవడం గమనార్హం. అన్నట్లు చార్మి వస్తువులతో పాటు షోరూంలో విలువైన వస్తువులు కూడా మాయమయ్యాయట. ధీంతో దీలా పడిన షోరూం నిర్వాకులకి పోయిన వస్తువుల కారణంగా నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకొన్న పనైందని గప్ చిప్ అయ్యారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X