twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున అలా అన్నారని ఏడ్చేసా: ఛార్మి

    By Srikanya
    |

    Charmy remembers Mass movie shooting days
    హైదరాబాద్: 'మాస్‌' సినిమా చేసేంతవరకూ నేను సెట్‌లో టామ్‌ బాయ్‌లా ఉండేదాన్ని. అది గమనించిన నాగార్జున గారు 'నువ్వు చాలా చిన్నపిల్లవి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇలా ఉండకూడదు' అన్నారు. వెంటనే మేకప్‌ రూమ్‌లోకి వెళ్లి నేను నటినయ్యా.. ఇంకా కిడ్‌నేంటి అంటూ నాన్నకి చెప్పి ఏడ్చేశా. నాగార్జునగారికి ఆ విషయం తెలిసి 'బాధ పడకూడదంటూ' సెట్‌లో ఎలా ఉండాలో వివరించారు అని గుర్తు చేసుకుంది ఛార్మి.

    అమ్మాయి నడక ఎంత వయ్యారంగా ఉండాలో వివరించారు. ఒక తాడు పరిచి దాని మీదే నడవమన్నారు. అప్పటినుంచీ నన్ను నేను గమనించుకోవడం అలవాటు చేసుకున్నా. ఇంతలో అనుకోకుండా నా సీన్‌ మారిపోయింది. 'మంగళ', 'మంత్ర' సినిమాలతో భయపెట్టడం మొదలు పెట్టా. ప్రేక్షకుల్ని ఎంత భయపెట్టానో తెలియదు గానీ ఆ సినిమాలు మాత్రం నాకు చేదు... తీపి జ్ఞాపకాల కలబోత అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి.

    అలాగే... నాకు నంది తెచ్చిపెట్టిన 'మంగళ' గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసింది దానికోసమే! క్త్లెమాక్స్‌ వికారాబాద్‌ అడవిలో జరిగింది. రాళ్లమధ్యలో చెప్పులు కూడా లేకుండా నడిచా. చెట్ల కొమ్మలకీ తాళ్లతో వేలాడదీశారు. చివర్లో నా మీద విభూది చల్లుతారు. ఒక్కోరోజు ఎక్కువగా చల్లడం వల్ల కళ్లలో పడి రక్తం వచ్చేది. అంతేకాదు ఏడాది పాటు జుట్టు వూడిపోయింది. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేవి. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాక గానీ ఆ సమస్యలు తగ్గలేదు.

    ఈ సినిమా చేస్తున్నప్పుడు మరో విషయంలోనూ రాజీ పడ్డా. చిన్నప్పట్నుంచి చికెన్‌, మటన్‌ ఎక్కువగా తినేదాన్ని. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకూ మాంసాహారం ఉండాల్సిందే. 'మంగళ'లో శివుడికి పూజించే పాత్ర కాబట్టి ఆ మూడు నెలలు తినలేదు. కాయగూరలు తినలేక జీవితంలో ఎప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూ డదని నిర్ణయించుకున్నా. అలానే 'పౌర్ణమి'లో కూడా డాన్స్‌ నేర్చుకున్నా. దానిలోనూ క్త్లెమాక్స్‌ సీన్‌ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది అంది.

    ఇక ఛార్మి ప్రధాన పాత్రలో చరిత్ర చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'ప్రతిఘటన' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. డిషాలో ఇద్దరు యువతులపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రవర్తన, రౌడీల తీరు, ఓటర్లను చైతన్యపరిచే పలు అంశాలను ఈ చిత్రంలో పొందుపర్చినట్లు తమ్మారెడ్డి తెలిపారు.

    English summary
    Charmy’s ‘Prathigatana’ directed by Thamma reddy Bharadwaja is scheduled to release on April 4th. Charmi is acting as a Journalist in this heroine oriented film. Reshma is acting in another prominent character. Tammareddy;’s Charitha chitra banner s producing this movie while MM Keeravani is scoring music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X