For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్వెల్ మాత్రం కాదు... (‘మంత్ర-2’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : జ్యోతిలక్ష్మీ'తో మళ్లీ ఓ మెరుపు మెరిసిన ఛార్మి ఇప్పుడు తన హిట్ చిత్రాన్ని గుర్తు చేస్తూ 'మంత్ర-2' అంటూ దిగుతోంది. ఈ చిత్రం పూర్తి హర్రర్ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం తమిళంలోనూ విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రం ఏ లాంటి విజయాన్ని అందిస్తుందో, ఆ సినిమా తమిళనాట ఏ తీరున జనాన్ని భయపెడుతుందో చూడాలి.

  ఓ అమ్మాయి జీవితంలో అనూహ్యంగా చోటుచేసుకునే సంఘటనలు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం.

  హీరో చేతన్ మాట్లాడుతూ.... మంత్ర-2లో పోలీస్‌గా...
  ముంబయిలో అనుపమ్‌ఖేర్ వద్ద ఆరునెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాను. అనంతరం మోడల్‌గా ప్రముఖ సంస్థల యాడ్స్‌లో నటించాను. ముంబయిలో వున్న సమయంలో కె.యస్.రామారావుగారు ఫోన్ చేసి మంత్ర-2 చిత్రంలో హీరోగా నటించమని అడిగారు. కథ బాగా నచ్చడంతో ఒప్పుకున్నాను. మంత్ర-2లో ఛార్మిని ఓ సమస్య నుంచి కాపాడే పోలీసాఫీసర్‌గా పవర్‌ఫుల్ పాత్రను చేశాను. ఈ చిత్రం తెలుగులో నాకు శుభారంభాన్నిస్తుందన్న నమ్మకం వుంది అన్నారు.

  చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి

  నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మంత్ర' సినిమాకు ఇది సీక్వెల్‌ కాదు. హారర్‌, సస్పెన్స్‌ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఛార్మి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమె సహకారం మరువలేనిది. '' అని తెలిపారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  దర్శకుడు మాట్లాడుతూ....హారర్, సస్పెన్స్ ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో వుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఘట్టాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఛార్మి పాత్రలో భిన్న పార్శాలుంటాయి. ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇటీవల విడుదల చేసిన ఆడియో, ట్రైలర్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని నిర్మాతలు చెప్పారు.

  Charmy's Mantra-2 movie preview

  బ్యానర్: గ్రీన్‌ మూవీస్‌
  నటీనటులు: ఛార్మి, చేతన్‌, తనికెళ్ల భరణి, రాహుల్‌దేవ్‌, ఉత్తేజ్‌, డిల్లీ రాజేశ్వరి తదితరులు మాటలు: మోహనకృష్ణ,
  పాటలు: భాస్కరభట్ల,
  కెమెరా: తనికెళ్ల రాజేంద్ర,
  సంగీతం: సునీల్‌ కశ్యప్‌,
  సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి,
  సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్‌, రవితేజ, కె.సురేశ్‌.
  నిర్మాతలు : పి.శైరిరెడి, వి.యాదగిరిరెడ్డి
  కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం :ఎస్‌.వి.సతీశ్‌
  విడుదల తేదీ :31,జూలై 2015.

  English summary
  Charmy is already gearing up for her next release. The horror thriller, Mantra 2, will be releasing now on 31st July. Directed by SV Sateesh, 'Mantra 2' is touted to be a sequel to Charmme’s successful horror hit, Mantra. Mantra 2 is produced by Showry Reddy and Yadagiri Reddy on Green Movies banner and it has music composed by Sunil Kashyap.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X