చిరుతో కోరిక..చార్మి
ఛార్మికి ఉన్న తీరిని కోరిక చిరంజీవితో నటించటమేనని చెప్పుకొచ్చింది. అసలు ఏ హీరోయిన్ అయినా చిరంజీవి సరసన నటించాలనుకుంటుందని, తనకూ ఆ కోరిక ఉందని చార్మి చెప్పింది. కానీ తాను పెద్ద హీరోయిన్ ఆయ్యే సరికే చిరంజీవి సినిమాలను విడిచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారని ఆమె బాధ పడింది. అలాగే తన అభిమాన దర్శకుడు కృష్ణవంశీ అని, ఆయనే తనకు తెలుగు సినిమారంగంలో గట్టి పునాది వేశారని ఆమె మెచ్చుకుంది. ఒక సంగీత దర్శకుడితో కూడా ప్రేమాయణం ఉందని వినపుతోందని ప్రశ్నిస్తే ఆ రూమర్ తానూ విన్నానని చెప్పింది. అంతేగాక దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని తెగమెచ్చుకుంది. ఆయన ట్యూన్స్ వింటే పురి విప్పిన నెమలిలా ఆడాలనిపిస్తుందని చార్మి చెప్పింది. ఇవన్ని ప్రక్కన పెడితే మరి చిరంజీవి మళ్ళా సినిమాల్లో యాక్ట్ చేసి ఆమెకు అవకాశమిస్తేనే ఆమె కోరిక తీరుతుంది..ఆ టైమ్ వస్తే బావుంటుంది కదా.
charmy chiranjeevi politics krishnavamsi devisri prasad manorama ఛార్మి చిరంజీవి కృష్ణవంశీ దేవిశ్రీ ప్రసాద్


Click it and Unblock the Notifications