శ్రీనువైట్లకు ఛార్టెడ్ ఫ్లైట్ ఇచ్చారు (ఫోటో)
హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న శ్రీను వైట్ల కి అక్కడ లోకల్ గాతిరగటానికి ధర్మరాజు అనే తెలుగు ఎన్నారై ఓ ఛార్టెడ్ ఫ్లైట్ ఇచ్చారు. ఈ విషయమై శ్రీను వైట్ల ట్వీట్ చేసారు.
శ్రీను వైట్ల కామెడీ అంటే ఆయనకి ప్రాణమని అందుకే ఆయన అక్కడ శ్రీను వైట్లను రిసీవ్ చేసుకుని,ఇలా ఖుషీ చేసాడని చెప్పుకుంటున్నారు. ప్లైట్ ఎరేంజ్ చేయటం గ్రేట్ హానర్ (గొప్ప గౌరవం)గా భావిస్తున్నాని శ్రీను వైట్ల అన్నారు.
ప్రస్తుతం శ్రీను వైట్ల ఆగడు చిత్రం కథ వంటకంలో ఉన్నాడు. ఈ చిత్రం ఫార్మల్ గా ఓపెన్ అయ్యింది కానీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆగస్టు మొదటివారం నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.
ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల విజయం వెనక శ్రీను వైట్ల టాలెంట్‌తో పాటు గోపీ మోహన్, కోన వెంకట్ లాంటి రచయితల కృషి కూడా దాగి ఉంది.
'బాద్ షా' తర్వాత మహేష్ బాబుతో 'ఆగడు' సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట శ్రీను వైట్ల.
శ్రీను వైట్ల దర్శకత్వం మొదలు పెట్టి 15 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఆయన 13 సినిమాలకు దర్శకత్వం వహించారు. తొలి నాళ్లలో వచ్చిన నీ కోసం, ఆనందం, సొంతం లాంటి చిత్రాలకు శ్రీను వైట్ల సొంతంగా స్క్రిప్టు రాసుకున్నారు. ఆ తర్వాత ఆయనతో చేయి కలిపారు గోపీ మోహన్. ఢీ, రెడీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి చిత్రాలతో పాటు 8 చిత్రాలకు కథ అందించారు.
అయితే చాలా కాలం తర్వాత మళ్లీ సొంతగా స్టోరీ రాయడం మొదలు పెట్టారు శ్రీను వైట్ల. 'ఆగుడు సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యుడొకరు మీడియాతో మాట్లాడుతూ దూకుడు తర్వాత శ్రీను వైట్ల మహేష్ బాబుతో ఆగడు సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ఆయనే సొంతంగా స్టోరీ రెడీ చేసుకుంటున్నారు' అని తెలిపారు. దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











