యాంకర్ రేష్మిలో టాలెంట్ ఈ రేంజిలో ఉందా.. (చారుశీల ట్రైలర్)

By Bojja Kumar

హైదరాబాద్: యాంకర్ రేష్మిని ఇప్పటి వరకు జబర్దస్త్ కామెడీ షోలో.... తర్వాత 'గుంటూరు టాకీస్' మూవీలో గ్లామరస్ లుక్ లో మాత్రమే చూసాం. అయితే ఆ సినిమాలో ఆమెకు నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. అయితే ఆమె తాజా చిత్రం 'చారుశీల'లో మాత్రం రేష్మికి యాక్టింగ్ పరంగా తన టాలెంటును ఓ రేంజిలో చూపించే అవకాశం దక్కింది. తాజాగా విడుదలైన 'చారుశీల' ట్రైలర్ చూస్తే ఆవిషయం మీకూ అర్థమవుతుంది.


వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చారుశీల'. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య తారాగణం. ఈ సినిమా లోగో, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల ఫిల్మ్ చాంబర్ లో జరిగింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Charusheela Theatrical Trailer

దర్శకుడు శ్రీనివాస్ వుయ్యూరు మాట్లాడుతూ.. "థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ గా 100 సినిమాలు పూర్తయిన తర్వాత చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్ గారికి లైన్ చెప్పగా, మనమే ప్రొడ్యూస్ చేద్దామన్నారు. వీల్ చైర్ లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల నటిస్తాడా? లేదా? అని భయపడ్డాను, ఒప్పుకున్నాడు. అద్బుతంగా నటించాడు, రాజీవ్ కనకాల, రేష్మిలకు అవార్డులు వస్తాయి. మా అబ్బాయి ఓ క్యారెక్టర్ చేశాడు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని అన్నారు.

బెనర్జీ, మెల్కోటే, రాకెట్ రాఘవ, గెటప్ శీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు : కుమార్ మల్లారపు, ఎడిటింగ్ : వి.నాగిరెడ్డి, సంగీతం : సుమన్ జూపూడి, ఆర్ట్ : బాబ్జీ, నిర్మాతలు : వి.సాగర్ & శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు, కథ - స్క్రీన్ ప్లే - సినిమాటోగ్రఫీ - దర్శకత్వం :శ్రీనివాస్ రెడ్డి వుయ్యూరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X