»   » మహేష్ బాబు లైవ్ చాటింగ్ చేయాలనుందా?

మహేష్ బాబు లైవ్ చాటింగ్ చేయాలనుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో లైవ్ చాటింగ్ చేయాలనుందా? అయితే ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు(6.30 pm IST/9 am EST) సిద్ధంగా ఉండండి మరి. ఫ్రీడోకాస్ట్ వారు ఈ లైవ్ చాటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ లైవ్ చాటింగులో బ్రహ్మోత్సం చిత్రానికి సంబంధించిన విషయాలను మహేష్ బాబు అభిమానులతో పంచుకోబోతున్నారు. దీంతో పాటు తన పర్సనల్ విషయాల గురించి అడిగే ప్రశ్నలకు కూడా మహేష్ బాబు సమాధానం ఇస్తారు. అభిమానులారా...! ఇంకెందుకు ఆలస్యం, సాయంత్రం సిద్ధంగా ఉండండి.


Also Read: మహేష్ బాబు అంత దారుణమైన మాటనేసాడేంటి?


Chat LIVE with Superstar Mahesh Babu

మహేష్ బాబు నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' సినిమా విషయానికొస్తే... ఇటీవలే ఆడియో విడుదలైంది. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 20న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Get a chance to interact with Mahesh Babu live only on Freedocast! Play today and get a chance of a lifetime to live chat with your superstar!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu