టాక్ ఆఫ్ ది టౌన్: RRRలో ఎన్టీఆర్ చేసేది ఒక రోల్ కాదు.. సీక్రెట్ లీక్ చేసిన ఛత్రపతి శేఖర్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో పాటు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం RRR. టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమాపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ గురించి ఓ న్యూస్ వచ్చినా హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న రోల్స్ గురించి సీనియర్ నటుడు రివీల్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా కథ.? వివరాల్లోకి వెళితే...

జక్కన్న వల్ల ఇద్దరూ కష్టపడుతున్నారు
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRRలో జూనియర్ ఎన్టీఆర్.. కొమరం భీంగా, రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరూ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండడంతో ఫిజిక్‌పై బాగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం రోజులో ఎక్కువ భాగం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ మాత్రం ఒక అడుగు ముందే
ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్.. చరణ్ కంటే ఒక అడుగు ముందే ఉంటున్నాడు. మెగా హీరో కొద్ది రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడంతో తారక్‌తో చాలా సన్నివేశాలు చిత్రీకరించాడు జక్కన్న. దీంతో అతడి పార్ట్ దాదాపుగా పూర్తయింది. అలాగే, ఎన్టీఆర్ ఇంట్రడెక్షన్ సీన్ కూడా ఇప్పటికే చిత్రీకరించారని అంటున్నారు. దానికి సంబంధించిన వీడియోనే ఇటీవల లీక్ అయింది.

RRRలో ఎన్టీఆర్ చేసేది ఒక రోల్ కాదు
RRRలో రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఎన్టీఆర్ నటించిన సీన్స్ బాగా హైలైట్ అవుతాయని అంటున్నారు. అంతేకాదు, ఇందులో తారక్ చాలా గెటప్పుల్లో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన క్లారిటీ బయటకు వచ్చింది.

సీక్రెట్ లీక్ చేసిన ఛత్రపతి శేఖర్.!
RRR సినిమాలో నటిస్తున్న ఛత్రపతి శేఖర్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇందులో ఎన్టీఆర్ చేస్తున్న రోల్స్ గురించి లీక్ చేశాడు. ‘నేను తారక్ స్నేహితుడిగా కనిపిస్తాను. అతడు మూడు గెటప్స్‌లో కనిపిస్తాడు. ఆ మూడూ ఎన్టీఆర్‌కు బాగా సెట్ అయ్యాయి. అందులో లీనమైపోయి నటించాడు' అని చెప్పుకొచ్చాడు.

ఛత్రపతి శేఖర్.. రాజమౌళి సెంటిమెంట్
ఛత్రపతి శేఖర్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ శాతం విలన్ పాత్రలే ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ‘సింహాద్రి', ‘సై', ‘ఛత్రపతి' సహా ఎన్నో సినిమాల్లో అతడు అద్భుతమైన నటనను కనబరిచాడు. దీంతో శేఖర్‌ను రాజమౌళి తన ప్రతి సినిమాలో పెట్టుకుంటాడని అంటుంటారు. ఇందులో భాగంగానే RRRలో కూడా అవకాశం ఇచ్చాడని టాక్.

RRRలో ఎవరెవరు ఉన్నారంటే...
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లు. అలాగే ఇందులో అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, ఛత్రపతి శేఖర్ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











