ప్రభాస్ పట్టుకోవడంతో ఊపిరి ఆడలేదు..చనిపోతా అనుకున్నా: రెబెల్ స్టార్‌పై శేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ ఫాలోయింగ్‌తో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు వరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందిన అతడు.. 'బాహుబలి' తర్వాత యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రేంజ్‌తో పాటు మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి అతడి పేరు మారుమ్రోగిపోతోంది. తాజాగా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఓ సీనియర్ యాక్టర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.!
Recommended Video


అదొక్కటే ప్రభాస్ రేంజ్‌కు నిదర్శనం
‘బాహుబలి' వంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీకి హిందీలో మినహా అన్ని భాషల్లో నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఉత్తరాదిలో ప్రభాస్ రేంజ్ భారీగా పెరగడంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

వాటికి ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేశాడు
రెండు బడా ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. 1960 దశకం నాటి కథతో రూపొందుతోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. గోపికృష్ణ బ్యానర్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదట ‘జాన్' అనుకున్న ఈ మూవీ టైటిల్‌ను మార్చి ‘ఓ డియర్' లేదా ‘రాధేశ్యామ్'లో ఒకటి పెట్టాలని భావిస్తున్నారు.

ప్రతీది హాట్ టాపిక్కే.. అందుకే హైలైట్ అవుతోంది
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ రోల్, హీరోయిన్ పాత్ర, నటీనటుల ఎంపిక సహా కథ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీలో ఎన్నో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.

రెబెల్ స్టార్‌పై సీనియర్ యాక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఛత్రపతి శేఖర్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఛత్రపతి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సముద్రం మధ్యలోకి వెళ్లాం. అక్కడ నేను నీటిలోంచి పైకీ లేచే సీన్‌లో పట్టు తప్పి మునిగిపోబోయాను. అప్పుడు ప్రభాస్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆ సమయంలో నాకు ఊపిరి ఆడకపోవడంతో చనిపోతా అనుకున్నా' అని చెప్పుకొచ్చాడు.

నన్ను పట్టుకోవడం వెనుక ఆయన ఉద్దేశ్యం అదే
దీనిని కొనసాగిస్తూ... ‘ప్రభాస్ నన్ను గట్టిగా పట్టుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. ఆయన నన్ను వదిలేస్తే బోటు కింద ఉండే ఫ్యాన్‌కు తగిలేవాడిని. అప్పుడు నేను గాయపడి చనిపోదును. అందుకే ప్రభాస్ నన్ను వదలకుండా పట్టుకున్నాడు. నేను చనిపోతానేమో అన్న భయంతో కష్టమైనా చాలా సేపు పట్టుకున్నాడు. అది ఆయన గొప్పదనం' అని వివరించాడు.

ఈ శేఖర్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం
ఛత్రపతి శేఖర్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ శాతం విలన్ పాత్రలే ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ‘సింహాద్రి', ‘సై', ‘ఛత్రపతి' సహా ఎన్నో సినిమాల్లో అతడు అద్భుతమైన నటనను కనబరిచాడు. దీంతో శేఖర్‌ను రాజమౌళి తన ప్రతి సినిమాలో పెట్టుకుంటాడని అంటుంటారు. ఇందులో భాగంగానే RRRలో కూడా అవకాశం ఇచ్చాడని టాక్.


Click it and Unblock the Notifications











