ఛత్రపతి చైల్డ్ ఆర్టిస్ట్ సూరీడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.. యంగ్ హీరోగా..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన వాళ్ళు సడన్ గా దర్శనమిస్తే జనాల్లో చాలా ఈజీగా ఫోకస్ అవుతారు. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వలన వాళ్ళ గురించి ఎవరైనా చెబితే గాని తెలిసేది కాదు. కానీ ఈ రోజుల్లో ప్రతి యాక్టర్ కు సోషల్ మీడియా ఎకౌంట్ అనేది కామన్ గా మారింది. ఆ దారిలోనే చైల్డ్ ఆర్టిస్టులు భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్ నుంచి పెంచుకుంటున్నారు. ఇక ఛత్రపతి సినిమాలో సూరీడు ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 కంటతడి పెట్టించాడు.

కంటతడి పెట్టించాడు.

రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా ఛత్రపతి ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలో కథతో పాటు అందులోని పాత్రలు కూడా జనాల్లో బలంగా పాతుకుపోయాయి. మ్యూజిక్ తో కూడా కీరవాణి కంటతడి పెట్టించాడు.

 ప్రభాస్ ఛత్రపతి రికార్డ్

ప్రభాస్ ఛత్రపతి రికార్డ్

ఛత్రపతి సినిమా కోసం ప్రభాస్ తన స్టైల్ ను ఫిట్నెస్ ను పూర్తిగా మార్చేశాడు. బాక్సాఫీస్ వద్ద నిర్మాతకు భారీగా లాభాలు అందించడమే కాకుండా ప్రభాస్ కెరీర్ లో అత్యదిక సెంటర్లలో సెంచరీ కొట్టిన సినిమాగా కూడా గుర్తింపు అందుకుంది. సినిమాలో ప్రభాస్ కు జోడిగా శ్రియా నటించిన విషయం తెలిసిందే.

 సూరీడు.. ఎలా సెలెక్ట్ అయ్యడంటే

సూరీడు.. ఎలా సెలెక్ట్ అయ్యడంటే

ఇక ఛత్రపతి సినిమాలో సూరీడు పాత్ర గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కనిపించేది కొన్ని సీన్స్ లోనే అయినా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని అందుకున్నడు. అతని పూర్తి పేరు భస్వంత్ వంశీ. ఛత్రపతి సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లగా మొదటి రౌండ్ లోనే సెలెక్ట్ అయ్యాడు. అతని అమాయక చూపులకు జక్కన్న ఫిదా అయిపోయాడట.

ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన నటన

ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన నటన

సినిమాలో సూరీడు మదర్ సెంటిమెంట్ సీన్ ఇప్పుడు చూసినా కూడా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇక కాట్ రాజ్ సీన్ లో కూడా అతని పాత్ర హార్ట్ బ్రేకింగ్ అనేలా ఉంటుంది. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి సూరీడు బాగా హెల్ప్ చేశాడు. సినిమా హిట్టయిన అనంతరం అతని గురించి చాలామంది అగ్ర నటులు అడిగి తెలుసుకున్నారట.

Recommended Video

Chatrapathi Sekhar Reveals The Greatness Of Prabhas
హీరోగా ప్రయత్నాలు

హీరోగా ప్రయత్నాలు

భస్వంత్ వంశీ ప్రస్తుతం 26ఏళ్ళ వయసులోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎక్కువగా చేయలేదు. ఇక విదేశాల్లో చదువును పూర్తి చేసుకొని ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మంచి పాత్రతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక అతని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X