పెళ్లి త‌ర్వాత చైతన్య-శామ్‌ల మొదటి ఫొటోలు ఇవే

చైతన్య, సమంత పెళ్లి త‌ర్వాత ఈ న‌వ దంప‌తులిద్ద‌రూ ప్రత్యూష స‌పోర్ట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఫౌండ‌ర్ డాక్ట‌ర్‌ మంజులతో ఫొటో దిగారు. కొత్త పెళ్లి కూతురు సమంత ఎరుపు రంగు డ్రెస్ లో చిరున‌వ్వులు చిందిస్తోంది.

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుకతో చైతు, సమంత మురిసిపోతున్నారు. బంధుమిత్రుల కేరింతల మధ్య చై, సామ్‌ల పెళ్లి అదుర్స్ అనిపించింది. పెళ్లి డ్రెస్స్‌ల్లో చై, శామ్‌ చమక్‌మన్నారు. వేదమంత్రాలు, కుటుంబ పెద్దలు, సన్నిహితుల మధ్య నాగచైతన్య, సమంత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఏడడుగులతో పంచభూతాలు, నాలుగుదిక్కుల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.

చైతూ, సమంతల పెళ్లి

చైతూ, సమంతల పెళ్లి

అక్టోబర్ 6 న హిందూ సంప్రదాయం ప్రకారం, అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చైతూ, సమంతల పెళ్లి జరిగింది. తమ ఫ్యామిలీ సభ్యులు కాకుండా కేవలం వంద మంది మాత్రమే హాజరయిన ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని నాగ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకొన్నారు. ఈ పెళ్లితో నాగార్జున ఎంత సంతోషంగా ఉన్నారో నాగ్ చేసిన పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది.

 సమంత తల్లిదండ్రులు అంగీకరించలేదట

సమంత తల్లిదండ్రులు అంగీకరించలేదట

వాస్తవంగా సమంతది క్రిస్టియన్ కుటుంబమన్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జున తనయుడు చైతూను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తొలుత చెప్పినప్పుడు సమంత తల్లిదండ్రులు అంగీకరించలేదట. మతాంతర వివాహానికి అంగీకరించని అమ్మానాన్నలను నానా తంటాలు పడి మరీ సమంత ఒప్పించగా, తమ బిడ్డ వివాహం తమ సంప్రదాయంలో జరగాలని వారు కోరారట.

 రెండు సంప్రదాయాల ప్రకారం

రెండు సంప్రదాయాల ప్రకారం

ఇదే విషయాన్ని నాగార్జునకు చెప్పి, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగితేనే తనకు ఆనందమని తేల్చి చెప్పిందట. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కోసం తాను ఈ మాత్రమైనా చేయాలని సమంత చేసిన విజ్ఞప్తితో ఆలోచనలో పడ్డ నాగ్, రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని సూచించారట. దీనికి ఎగిరి గంతేసి ఒప్పుకున్న సమంత, అటు తల్లిదండ్రుల కోరికను, ఇటు అత్తింటి మత సంప్రదాయాలను గౌరవించి, అక్కినేని వారింట కోడలిగా కాలుపెట్టింది.

 డ్యాన్స్ చేసిన ఫొటో

డ్యాన్స్ చేసిన ఫొటో

ప్రీ వెడ్డింగ్ సంద‌ర్భంగా చైతూ ష‌ర్ట్ ను నాగార్జున లాగేస్తున్న ఫొటో....నాగ్‌, వెంకీ, చైతూలు డీజేలో డ్యాన్స్ చేసిన ఫొటో....సురేష్ బాబు, స‌మంత‌లు క‌లిసి చిందులేసిన ఫొటో...ఇవ‌న్నీ అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే, పెళ్లయిన త‌రువాత వారి ఫొటోలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు.

ప్రత్యూష స‌పోర్ట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఫౌండ‌ర్

ప్రత్యూష స‌పోర్ట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఫౌండ‌ర్

తాజాగా, ఈ జంట దిగిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. న‌వ దంప‌తులిద్ద‌రూ ప్రత్యూష స‌పోర్ట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఫౌండ‌ర్ డాక్ట‌ర్‌ మంజులతో ఫొటో దిగారు. కొత్త పెళ్లి కూతురు సమంత ఎరుపు రంగు డ్రెస్ లో చిరున‌వ్వులు చిందిస్తోంది. కొత్త‌ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోనే ట్రెండింగ్ లో ఉంది

ఈ ఫొటోనే ట్రెండింగ్ లో ఉంది

పెళ్లి త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి ఫొటో కావ‌డంతో ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్లో ఈ ఫొటోనే ట్రెండింగ్ లో ఉంది. చైతూ, శామ్ లు హ‌నీమూన్ త‌ర్వాత షూటింగ్‌లో పాల్గొంటారు. హ‌నీమూన్ అనంత‌రం స‌మంత రంగ‌స్థ‌లం 1985 చిత్ర షూటింగ్ లో, చైతూ స‌వ్య‌సాచి షూటింగ్ లో పాల్గొంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X