పెళ్లిలో సమంత ఫ్యామిలీ ఎక్కడా?? అంటూ తెగ గోల చేశారుగా... ఇదిగో!
చైతు-సమంత పెళ్లి వేడుకలో సమంత ఫ్యామిలీ మిస్సయిందంటూ ఇంతకాలం సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
నాగ చైతన్య, సమంత వివాహం ఇటీవల గోవాలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహ వేడుక జరిగింది. గోవా సముద్ర తీరంలోని 'డబ్ల్యూ' అనే స్టార్ హోటల్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది సంఖ్యలో సినీ ప్రముఖులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే.
పెళ్లి వేడుక అనంతరం నూతన వధూవరులతో నాగార్జున కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు దిగిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో ఎక్కడా కూడా సమంత ఫ్యామిలీ కనిపించక పోవడంతో రకరకాలుగా మాట్లాడుకున్నారు.

సమస్య వస్తుందనే
సెక్యూరిటీ ఇష్యూ వస్తుందనే ఉద్దేశ్యంతోనే సమంత ఫ్యామిలీ ఉన్న ఫోటోలను బయటకు రానివ్వలేదు. ఎందుకంటే వారు ఎవరో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. వారు సమంత తల్లిదండ్రులు, నాగార్జున వీయంకులు అని తెలిస్తే బయటకు వచ్చినపుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయనే ఇలా చేసినట్లు సమాచారం.
Recommended Video


సమంత ఫ్యామిలీ ఫోటో వైరల్
అయితే ఎలా బయటకు వచ్చిందో తెలియకానీ.... పెళ్లి వేడుకలో సమంత ఫ్యామిలీతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలోకి ఎక్కేసింది. దీంతో ఇపుడు ఆ ఫోటో వైరల్ అయింది.

ఆశ్చర్యపరిచిన సంఘటనలు
సమంత, చైతన్య పెళ్లిలో ఆశ్చర్య పరిచే సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ సైలెంటుగా ఉండే నాగ చైతన్య మేమనమామ, నిర్మాత సురేష్ బాబు ఈ పెళ్లి వేడుకలో మాస్ డాన్స్ చేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆయనలో ఈ కోణంకూడా ఉందని ఈ పెళ్లి వేడుక పుణ్యమా అని అందరికీ తెలిసింది.

ఇలా చూడటం ఇదే తొలిసారి
చైతూ చిన్నమేనమామ వెంకేటేష్.... మేనల్లుడి సినిమాల్లో నటించారు కానీ ఎప్పుడూ కలిసి స్టెప్పులు వేయలేదు. ఈ పెళ్లి వేడుక పుణ్యమా అని ఇద్దరూ కలిసి స్టెప్స్ వేయడం అభిమానులకు కనువిందు చేసింది.

ఎవరూ ఊహించని సంఘటన
ఇక ఈ పెళ్లి వేడుకలో ఎవరూ ఊహించని సంఘటన చైతు చొక్కా నాగార్జున లాగేయడం. సాధారణంగా కొడుకులతో తండ్రులెప్పుడూ ఇలా ప్రవర్తించరు. నాగార్జున తన కుమారులతో ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్ లా ఉంటాడనటానికి ఈ ఫోటోయే సాక్ష్యమని అంటున్నారు అక్కినేని అభిమానులు.

హ్యాపీ కపుల్
నాగ చైతన్య, సమంత నిజంగా హ్యాపీ కపుల్. 8 సంవత్సరాల పాటు స్నేహం కొనసాగించి తమ స్నేహ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుని సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇన్నేళ్లు ఎలాంటి మనస్పర్థలు లేకుండా వారి ప్రెండ్షిప్ సాగింది కాబట్టి..... నాగార్జున-అమల దంపతుల్లాగే వీరి బంధం కూడా ఎంతో బలంగా కలకాలం సాగుతుందని అభిమానులు పూర్తి నమ్మకంగా ఉన్నారు.

తాము కోరుకున్న విధంగా...
తాము కోరుకున్న విధంగానే చైతన్య, సమంత దంపతులు తమ పెళ్లి వేడుక జరుపుకున్నారు. గోవా ముద్ర తీరంలో ఎంతో రొమాంటిక్ గా జరిగిన వీరి వివాహ వేడుక ఈ నవదంపతులు మాత్రమే కాదు అభిమానులు కూడా ఎప్పటికీ మరిచిపోలేరు.

నాగార్జున ఫుల్ హ్యాపీ
నాగార్జున, సమంత గతంలో పలు సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తాను ఎంతో ఇస్టపడే సమంత తన కోడలు కావడంపై నాగార్జున కూడా చాలా సంతోషంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











