»   » చెగువెరా సమాధిలోనే ... పవన్ ట్వీట్లపై వర్మ సెటైర్

చెగువెరా సమాధిలోనే ... పవన్ ట్వీట్లపై వర్మ సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సెటైరిక్ గా స్పందించారు. మరి ఈ సారి పవన్ కళ్యాన్ వల్ల వర్మకు ఎక్కడ నొప్పి కలిగిందో ఏమో తెలియదు కానీ..... ఈ సారి కాస్త ఘాటుగానే స్పందించారు.

పవన్ కళ్యాణ్.... చెగువెరా అభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల్లో చెగువెరాకు సంబంధించిన మార్క్ కనబడుతుంది. ఈ సారి ఇద్దరి ముడి పెట్టి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం గమనార్హం.

పవన్ ట్వీట్లు చూస్తే చెగువెరా సమాధిలోనే...

‘పవన్ కళ్యా ట్వీట్లను చదివిని రత్వాత చెగువెరా సమాధిలోనే తన్మయత్వంతో తెగ సంబరపడి పోవాల్సిందే. పవన్ కళ్యాణ్ లోని అసాధారణమైన అర్థం చేసుకునే తత్వాన్ని చూసి ఆనంద పడాల్సిందే... అంటూ రామ్ గోపాల్ వర్మ సెటైరిక్ గా స్పందించారు.

సమాధిలో శాంతంగా ఉండలేడు

పవన్ కళ్యాణ్ మూలంగా... చెగువెరా తన సమాధిలో ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేదు. దట్స్ గ్రేట్ ఎందుకంటే శాంతిని వదిలేసి పవన్, చెగువెరా ఇద్దరూ ఫైర్ అయిపోతారు'' అంటూ వర్మ తనదైన రీతిలో ట్వీట్లు చేసారు.

వర్మ ట్వీట్లకు కారణం ఇదేనా?

వర్మ ట్వీట్లకు కారణం ఇదేనా?

బిజెపి నేత తరుణ్ విజయ్ దక్షిణాదివాళ్లని నల్లగా ఉన్నారని వ్యాఖ్యానించడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ...అది ఉత్తరాది అహంకారం అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నల్లగా వున్నవి వద్దనుకుంటే కోకిలను నిషేధించండి. మీరు ఎగరేసే జాతీక పతాకం ఒక దక్షిణాది మహనీయుడి రూలకల్పనే.. ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లో కన్పిస్తాంది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదిది. ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయి' అని పవన్ హెచ్చరిక చేశారు. ఈ విషయాన్ని ఉద్దేశించే వర్మ ఈ ట్వీట్లు చేసారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తరుణ్ విజయ్ చేసిన కామెంట్స్ ఏమిటంటే..

తరుణ్ విజయ్ చేసిన కామెంట్స్ ఏమిటంటే..

అల్ జజీరా టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్‌ విజయ్‌ ‘ఒకవేళ మాకే జాత్యాహంకారమనేది ఉంటే నల్ల గా ఉండే దక్షిణ భారతీయులతో ఎలా కలిసుంటాం. మా చుట్టూ కూడా నల్లజాతోళ్లున్నారు... అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసారు.

English summary
"Reading PawanKalyan tweets Che Guevera must be doing back flips in grave in a orgasmic ecstasy of revelling in pk's extraordinary insights. Che Guevara will never RIP in his grave becos of PawanKalyan and that's great becos both PK and Che should fire instead of RESTING IN PEACE" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu