»   » నిర్మాతను మోసం చేసిన నటిపై చీటింగ్ కేసు

నిర్మాతను మోసం చేసిన నటిపై చీటింగ్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండోర్: సినిమా నటి హిమాని శివపురిపై నిర్మాతను చీటింగ్ చేసిందనే ఆరోపణలతో చీటింగ్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం ఆమెపై ఇండోర్ విజయ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకే తాను కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

 Cheating case against Actress Himani Shivpuri

ఇండోర్ కు చెందిన ఫిల్మ్ ప్రొడ్యూసర్ మహ్మద్ అలీ హిమాని శివపురిపై పిటీషన్ దాఖలు చేసారు. తాను తీస్తున్న రెండు సినిమాల్లో నటిస్తానని మార్చి 22, 2011న అగ్రిమెంటుపై సంతకం చేసిందని, ఇందుకుగాను రూ. 5 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకుందని, అయితే సినిమా మధ్యలో తప్పకుందని, దీని వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని మహ్మద్ అలీ తన పిటీషన్లో పేర్కొన్నారు.

అలీ పిటీషన్ ను విచారించిన అడిషనల్ చీప్ జుడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్ ప్రసాద్ శుక్లా...హిమాని శివపురిపై కేసు నమోదు చేసి విచారణ జరిపి నివేదిక పంపాల్సిందిగా విజయ్ నగర్ పోలీసులను ఆదేశించారు.

English summary
Movie actress Himani Shivpuri has been booked for allegedly cheating a film producer, after a local court's directive, police said on Wednesday.
Please Wait while comments are loading...