పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన దర్శకుడిపై కేసు
పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తనతో సహజీవనం చేసి ముఖం చాటేసిన దర్శకుడిపై ఓ మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో పాటు తన వద్ద డబ్బు తీసుకుని పరారయ్యాడని పి.లక్ష్మి అనే మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు చేసే పి.లక్ష్మి అనే మహిళకు శ్రీదత్త అనే వర్ధమాన దర్శకుడు పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు, ఆపై సహజీవనానికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన శ్రీదత్త కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడం, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తన వద్ద డబ్బు, బంగారం తీసుకుని వెళ్లాడని... ఇపుడు మరో యువతిని పెళ్లాడి తనకు అన్యాయం చేశాడని లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
లక్ష్మి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో నిజా నిజాలు నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు.


Click it and Unblock the Notifications