కరెంటుతీగ దర్శకుడిపై బెల్లంకొండ చీటింగ్ కేసు
హైదరాబాద్: కరెంటు తీగ దర్శకుడు నాగేశ్వరరెడ్డిపై బంజరాహిల్స్ పోలీసుస్టేషన్‌లో చీటింగ్‌కేసు నమోదైంది. తన వద్ద రూ.20 లక్షల అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయలేదని బెల్లంకొండ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు 506,420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కరెంటు తీగ' సినిమా విషయానికొస్తే....ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సన్నీ లియోన్ ప్రధాన పాత్ర ధారులుగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘కరెంటు తీగ'.

సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.


Click it and Unblock the Notifications











