జెమిని ల్యాబ్స్ జీఎంపై.. నిర్మాత ఛీటింగ్ కేసు

దీనికితోడు శాటిలైట్ హక్కులను అమ్ముకొంది. దీంతో ఈశ్వరవరప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు జూబ్లీహిల్స్ పోలీసులను విచారణకు అదేశించింది. విచారణ చేపట్టిన పోలీసులు అనుమతులు లేకుండానే జెమిని ల్యాబ్స్ చిత్రాన్ని విడుదల చేయడంతోపాటు శాటిలైట్ హక్కులను అమ్ముకొందని గుర్తించారు. ఈ మేరకు జెమిని ల్యాబ్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌రావుపై ఛీటింగ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు
శ్రీనివాసరావుపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం 420,406 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాడొస్తాడు సినిమా ఆర్థికలావాదేవీలకు సంబందించి జీఎంపై ఈశ్వర్ వర ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా జీఎం శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











