డైరెక్టర్ వంశీ కృష్ణపై చీటింగ్ కేసు పెట్టిన హీరో
హైదరాబాద్: సినిమా వేషాలు ఇప్పిస్తామంటూ మెసాలు చేయడం ఈమధ్య టాలీవుడ్లో సర్వసాధారణమైంది. హీరోయిన్లు కావాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో మోసగించి లైంగికంగా వాడుకోవడం, అబ్బాయిలను హీరో వేషాలు ఇప్పిస్తామంటూ డబ్బు గుంజడం లాంటివి జరుగుతున్నాయి. తాజాగా అలాంటి మరో మోసం వెలుగులోకి వచ్చింది.
వంశీ కృష్ణ అనే దర్శకుడు తనకు హీరో అవకాశం ఇస్తానని చెప్పి రూ. 35 లక్షలు తీసుకున్నారంటూ నటుడు అరవింద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. 2010లో వచ్చిన ‘జోరు' అనే చిత్రంలో అరవింద్ హీరోగా నటించాడు. ఆ సినిమా తర్వాత అవకాశాలు లేక పోవడంతో అనేక ప్రయత్నాలు చేసాడు.

శ్రీనగర్ కాలనీ సమీపంలోని ప్రగతి నగర్ లో నివసించే దర్శకుడు వంశీ కృష్ణ వి-డ్రీమ్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. నటీనటుల కోసం ప్రకటనలు ఇచ్చాడు. దీంతో జోరు సినిమాలో నటించిన అరవింద్... వంశీకృష్ణను సంప్రదించాడు. హీరో ఛాన్స్ ఇస్తానని చెప్పి అతని వద్ద రూ. 35 లక్షలు తీసుకున్న వంశీ కృష్ణ సినిమా తీయక పోగా, డబ్బులు తిరిగి ఇవ్వక పోవడంతో అరవింద్ పోలీసులను సంప్రదించాడు. అరవింద్ ఫిర్యాదు మేరకు వంశీ కృష్ణపై ఫిర్యాదు నమోదు చేసారు.


Click it and Unblock the Notifications