నితిన్ సినిమా ఆడియో రైట్స్ ఇష్యూ: చీటింగ్ కేసు
హైదరాబాద్: నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ఆడియో రైట్స్ విషయంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో....శ్రేయాస్ మీడియా మేనేజింగ్ డైరెకర్టర్ జి.శ్రీనివాస్ రావు మీద చీటింగ్ కేసు నమోదైంది. నిర్మాత సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. ఆడియో రైట్స్ తీసుకుని తీసుకుని డబ్బులు ఎగ్గొట్టాడని, తిరిగి ఇవ్వకుండా మోసం చేసాడని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేసారు.

నిందితుడు శ్రీనివాసరావు.... సుధాకర్ రెడ్డి నుండి ‘గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం ఆడియో రైట్స్ ను తీసుకున్నాడు. డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ పూర్తయిన తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానని ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే అగ్రిమెంటు ప్రకారం శ్రీనివాసరావు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. సుధాకర్ రెడ్డి ఎన్ని సార్లు అడిగినా మొహం చాటేసాడు.
అనంతరం సుధాకర్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అయినా శ్రీనివాసరావు రెస్పాండ్ కాలేదు. శ్రీనివాసరావు ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ కంపెనీకి అమ్మినట్లు తెలియడంతో...సుధాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











