గబ్బర్ సింగ్ మోసం? బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసు!
హైదరాబాద్: ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్ర నిర్మాత బండ్ల గణేష్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఓ సినిమా పంపిణీ విషయంలో 80 లక్షలు అడ్వాన్స్ తీసుకొని... బెదిరింపులకు పాల్పడుతున్నాడని గుంటూరుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మూడు రోజుల క్రితం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్ర రైట్స్ ఇస్తానని నమ్మించి రూ. 80 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రైట్స్ ఇవ్వక పోగా....తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేసు విషయం పక్కన పెడితే...
బండ్ల గణేష్ నిర్మించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. తొలి రోజు దాదాపు 1800లకు పైగా థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











