»   » రజినీకాంత్ భార్య లత మీద చీటింగ్ కేసు... అసలేమయ్యింది??

రజినీకాంత్ భార్య లత మీద చీటింగ్ కేసు... అసలేమయ్యింది??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కబాలి విడుదల హడావుడిలో ఉన్న రజినీ కాంట్ కి చిన్నపటి షాక్ తగిలినట్తయ్యింది. ఆయన భార్య మీద చీటింగ్ కేసు నమోదయ్యింది. లింగా, కొచ్చడయాన్ ల విషయం లో ఎదురైన చేదు అనుభవాలు ఇప్పటికీ రజినీని వీడటం లేదు. మొన్నటికి మొన్న ఆ పాత బాకీల విశయమై ఆంధ్రప్రదేశ్, తెలంగానాలోని బయ్యర్లు కూడా కొంత గలాటా చేసిన విసయం తెలిసిందే.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొచ్చాడియన్ సినిమా హక్కులపై చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్‌టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు లతా రజనీకాంత్‌కు ఈ నోటీసులు జారీ చేసింది.

Cheating Case Filed Against Rajini's Wife

దీనిపై స్పందించాలని కోరింది. లతా రజనీకాంత్‌ కొచ్చాడియన్ పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్‌ను మోసగించారంటూ కేసు దాఖలైంది. అంతకుముందు బెంగళూరు పోలీసులు మోసానికి పాల్పడ్డారంటూ లతా రజనీకాంత్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అంతకుముందు బెంగళూరు పోలీసులు మోసానికి పాల్పడ్డారంటూ లతా రజనీకాంత్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

అయితే ఇప్పటి వరకూ రజినీ గానీ.., లతా రజినీ గానీ ఈ విషయం మీద ఏమీ స్పందించలేదు. మొత్తానికి కబాలి విడుదలకు ముందు ఇలాంటి కేసులు కాస్త ఇబ్బంది కరమే. ఇదే ప్రభావం తమిళనాడులో కాక పోవచ్చు గానీ బయటి రాస్ట్రాల్లో కబాలి కలెక్షన్లమీద పడే చాన్స్ ఉంది.

English summary
An FIR has been filed against superstar Rajinikanth's wife Latha in an alleged case of forgery, declaration of false statements and using of false evidence and cheating in relation to the 2014 film Kochadaiyaan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu