ప్రభాస్ ‘రెబెల్’ వివాదం: లారెన్స్‌పై చీటింగ్ కేసు
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రెబల్' చిత్రం విషయంలో దర్శకుడు రాఘవ లారెన్స్, నిర్మాతలు పుల్లారావు, భగవాన్ మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం లారెన్స్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనలో చీటింగ్ కేసు నమోదైంది. రూ. 5 కోట్ల విషయలో లారెన్స్ తమను మోసం చేసాడని నిర్మాతలు కోర్టు ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.

ఇదీ వివాదం...
‘రెబల్' చిత్రాన్ని రూ. 23 కోట్ల బడ్జెట్లో పూర్తి చేస్తానని, అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ మాటిచ్చాడు. ఈ మేరకు నిర్మాతలకు, లారెన్స్ మధ్య అగ్రిమెంట్ జరిగింది. అయితే సినిమా అనుకున్న దానికంటే రూ. 5 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టించారు లారెన్స్. సినిమా విడుదలైన తర్వాత ప్లాప్ టాక్ రావడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.
తాము నష్టపోయామని, అగ్రిమెంటు ప్రకారం అదనంగా పెట్టించిన రూ. 5 కోట్లు తమకు తిరిగి ఇవ్వాలని లారెన్స్‌పై ఒత్తిడి తెచ్చారు నిర్మాతలు. అయితే లారెన్స్ తాను డబ్బు తిరిగి ఇవ్వబోనని తేల్చి చెప్పాడు. దీంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో లారెన్స్‌తో పాటు అగ్రిమెంట్‌కు మధ్య వర్తిగా ఉన్న లారెన్స్ వ్యక్తి గత కార్యదర్శి రాజ్ కుమార్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆధేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్స్ 420, 406 కింద కేసు నమోదు చేసారు.


Click it and Unblock the Notifications











