మోసం చేసిందంటూ తమన్నాపై నిర్మాత కేసు

By Srikanya

ముంబై: తమన్నాపై ఇప్పుడు హిందీ నిర్మాత సలీమ్ అక్తర్ కేసు పెడతానని కోపంతో మండిపడుతున్నారు. వదిలిపెట్టనంటూ సీరియస్ అవుతున్నారు. ఆయన 2003లో నిర్మించిన హిందీ చిత్రం 'చాంద్ సా రోషన్ చెహ్రా'చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు గాను 2005 నుంచి 2010 వరకు నటించే సినిమాలకు సంబంధించిన పారితోషికంలో 25 శాతం ఇవ్వాలని తమన్నాని సలీమ్ డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇవ్వనందుకు కానూ ఆమెపై కేసు పెడతానని ఆయన మండిపడుతున్నారు.

ఈ విషయమై నిర్మాత సలీమ్‌అక్తర్ చెబుతూ -''మా అమ్మాయి, తమన్నా ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. 'చాంద్ సా రోషన్..'కి తమన్నాని తీసుకోమని, చాలా అందంగా ఉంటుందని మా అమ్మాయే చెప్పింది. ఆ తర్వాత తమన్నా తన తల్లిదండ్రులతో సహా మా ఇంటికి రావడం, తనని హీరోయిన్‌గా తీసుకోవడం జరిగింది. అప్పుడే తమన్నాతో ఐదేళ్లు తన పారితోషికంలోంచి 25 శాతం నాకివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాను.
ఆ తర్వాత తమన్నా సౌత్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. నేను కాంటాక్ట్ చేస్తే తను స్పందించలేదు. మాట ఇచ్చినట్లు నాకు డబ్బు ఇవ్వలేదుఅన్నారు.

అలాగే తమన్నా తన పేరు స్పెల్లింగ్‌ని మార్చేసుకుంది. ఇంటి పేరు 'భాటియా'ని తొలగించి 'తమన్నా'గా చెలామణి అవుతోంది. ఇప్పుడు హిందీలో 'హిమ్మత్‌వాలా' చేస్తోంది. నాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తమన్నా సమాధానం చెప్పాలి. నేను తనపై కేసు పెట్టాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. దీనికి తమన్నా ఇంకా రిప్లై ఇవ్వలేదు.

ప్రస్తుతం తమన్నా నటించిన రెబెల్ త్వరలో విడుదల కానుంది. 'కెమెరామాన్ గంగతో రాంబాబు' సెట్స్‌పై ఉంది. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా తమన్నా చేతిలో ఉన్నాయి. రెబెల్ చిత్రంలో ప్రభాస్ సరసన ఆమె నటించింది. లారెన్స్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసాడు. ఇక 'కెమెరామాన్ గంగతో రాంబాబు'లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నాడు. పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులపై తమన్నా మంచి నమ్మకంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X