‘బాహుబలి’: కేక పుట్టించే లుక్ లో ప్రభాస్, రానా (ఫోటోస్)
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేస్తూ......సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల ప్రభాస్ కు సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేయగా, తాజాగా రానాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్లు పవర్ ఫుల్ లుక్ తో ఉంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన చిత్రంగా చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











