ఇద్దరు కూతుర్లతో పవన్ కళ్యాణ్ (రేర్ ఫోటో)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌తో విడిపోయిన తర్వాత అన్నా లెజనివాను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అంతకు ముందు రెండో భార్య రేణు దేశాయ్ ద్వారా అకీరా అనే కుమారుడు, ఆధ్యా అనే కూతురుకు పవన్ కళ్యాన్ తండ్రయ్యారు.
పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో ఉన్న ఫోటో ఒకటి తాజాగా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇది వరకెప్పుడూ చూడని రేర్ ఫోటో కావడంతో ఈ ఫోటో ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజనివాతోనే కలిసి ఉంటున్నారు. రేణు దేశాయ్ పవన్‌తో విడిపోయి ప్రస్తుతం మరాఠీలు సినిమాలు తీస్తూ బిజీ అయిపోయింది. అకీరా, ఆద్యా ఆమె వద్దే ఉంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గోపాలా గోపాలా చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకుడు. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్'కిది రీమేక్. అందులో పరేష్ రావల్ పోషించిన పాత్రను ఇక్కడ వెంకటేష్, అక్షయ్ కుమార్ చేసిన కృష్ణుడు పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.


Click it and Unblock the Notifications











