అందాలు: హాహా కారాలు పెట్టించిన సెక్సీ సోహా (ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. నిన్నటితరం బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ కూతురుగా....ప్రస్తుత బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సోదరిగా ఆమె అందరికీ సుపరిచితమే. తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పదేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేసిన సోహా అలీ ఖాన్.....హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు.
పదేళ్ల కెరీర్లో దాదాపు 20కి పైగా చిత్రాల్లో సోహా అలీ ఖాన్ నటించింది. 'రంగ్ దే బసంతి' లాంటి భారీ బాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా సోహా అలీ ఖాన్ నటించింది. రంగ్ దే బసంతి చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డుకూడా దక్కించుకుంది. అయితే బాలీవుడ్లో ఆమెకు రావాల్సినంత గుర్తింపు మాత్రం రావడం లేదు. ఆయా సినిమాల్లో సోహా అలీ ఖాన్ చేస్తున్న పాత్రలు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు కావడమే ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడానికి కారణం.
మరో వైపు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం కూడా ఆమెకు పెద్ద మైనస్‌గా మారింది సినిమాల్లో స్కిన్ షోకు దూరంగా ఉంటున్నా......మేగజైన్లపై మాత్రం అప్పుడప్పుడు అందాల విందూ చేస్తూ ఇండస్ట్రీలో నేనంటూ ఒక బ్యూటీని ఉన్నానంటూ గుర్తు చేస్తోంది. తాజాగా 'మాగ్జిమ్' అనే మగేజైన్ పై మాగ్జిమమ్ అందాలు ఆరబోసింది. బికినీలో దర్శనమిచ్చి అందరూ బిత్తరపోయేలా చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

సోహా అలీ ఖాన్
సోహా అలీ ఖాన్ అక్టోబర్ 4, 1978లో జన్మించింది. మాజీ బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్, మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ ఆమె తల్లిదండ్రులు

సినీరంగ ప్రవేశం
సోహా అలీ ఖాన్ 2004లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన తొలి చిత్రం బెంగాలీ మూవీ ‘ఇతి శ్రీకాంతా'

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
ప్రస్తుతం సోహా అలీ ఖాన్ రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ‘Chaarfutiya Chhokare' అనే చిత్రంతో పాటు, ‘Mr Joe B. Carvalho' అనే చిత్రంలో ఆమె నటిస్తోంది.

కునాల్ ఖేముతో సహజీవనం
సోహా అలీ ఖాన్ వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. అయితే బాలీవుడ్ నటడు కునాల్ ఖేముతో ఆమె సజీవనం చేస్తోంది. ఇద్దరూ కలిసి ఉంటున్నారు. త్వరలో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











