Just In
- 30 min ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 45 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- News
శకటాల పరేడ్ వర్సెస్ ట్రాక్టర్ల నిరసన ప్రదర్శన: గణతంత్ర చరిత్రలో తొలిసారిగా: అసలు నిర్వచనం
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్రిష ఎంగేజ్మెంట్ గిఫ్టు ఇదే... (ఫోటో)
హైదరాబాద్: హీరోయిన్ త్రిష ఎంగేజ్మెంట్ సందర్భంగా తనకు కాబోయే భర్త వరుణ్ మణియన్ నుండి ఒక అద్భుతమైన గిఫ్టు అందుకోబోతోంది. త్రిషకు మూగ జీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కుక్క పిల్లలంటే అమితమైన ప్రేమ. త్రిష ఇష్టాన్ని గమనించిన వరుణ్ మణియన్ ఆమె మనసుకు నచ్చే పని చేసాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
CAD(చెన్నైయ్ అడాప్షన్ డ్రైవ్) సంస్థకు సంవత్సరం పాటు నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. ఈ సంస్థ చెన్నైలో కుక్క పిల్లల సంరక్షణ చేపడుతోంది. అనాదలైన వీది కుక్కలను చేరదీసి వాటికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం, మందులు అందిస్తుంది. వాటి సర్జరీలకు అయ్యే కర్చు కూడా భరిస్తుంది. ఈ సంస్థకు తమవంతు సహాయంగా సంవత్సరం పాటు నిధులు సమకూర్చాలని నిర్ణంచాడు వరుణ్ మణియన్.

ఈ నెల 23న వీరి నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుక కోసం ఇరు కుటుంబాల వాళ్లు సన్నాహాలు మొదలుపెట్టారట. నిశ్చితార్థం వేడుక తేదీని ప్రకటించిన త్రిష వివాహ తేదీని మాత్రం ప్రకటించలేదు. నిశ్చితార్ధానికి ఆమె కాబోయే భర్త వరుణ్ కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 7కోట్ల రూపాయల ఖరీదైన రోల్స్ రాయ్స్ కారును బహుమతిగా త్రిష అందుకోబోతుందని మీడియాలో గుప్పుమంది. అయితే ఈ విషయమై ఆమె కాబోయే భర్త వరుణ్ కొట్టి పారేస్తున్నారు. అలాంటిదేమీ లేదని అన్నారు.

వీరి పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఆమె పెళ్లి విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అందరిలా సాదా సీదాగా కాకుండా....వెరైటీగా పెళ్లి జరుపుకునేందుకు ప్లాన్ చేసకుంటున్నట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఈ మధ్య కొందరు ప్రపంచం దృష్టిని ఆకర్షించుకునేందుకు పారాచూట్ పెళ్లి, సముద్రం అడుగున నీటిలో పెళ్లి, ఆకాశంలో విమానంలో పెళ్లి లాంటివి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. త్రిష కూడా అదే తరహాలో చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటోందట. విమానంలో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు టాక్. అదే నిజమైతే ఇండియా వ్యాప్తంగా త్రిష పెళ్లి మారు మ్రోగి పోవడం ఖాయం.