Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బికినీ అందాలతో దుమ్మురేపే ధూమ్ గర్ల్స్(ఫోటో ఫీచర్)
ముంబై: హాలీవుడ్ జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు ఎలానో....బాలీవుడ్లో ‘ధూమ్' సిరీస్ సినిమాలు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఈ సిరీస్ లో మూడు చిత్రాలు వచ్చాయి. అన్నీ సూపర్ హిట్టే. వసూళ్ల పంట పండించాయి. త్వరలో ధూమ్-4 చిత్రం కూడా రాబోతోంది. ఈ సారి షారుక్ ఖాన్ నటిస్తాడని అంటున్నారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేషాల చేసే హీరోలు, తమ హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్తో అలరించే హీరోయిన్లు, ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్‌తో సాగే ‘ధూమ్' సిరీస్ సినిమాలపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం.
గతేడాది విడుదలైన ‘ధూమ్-3' చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, సెక్సియెస్ట్ హీరోయిన్ కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్ ముఖ్య మైన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్ తన హాట్ హాట్ అందాలు ఆరబోయిస్తూ చేసిన ‘ధూమ్ మచాలే..' సాంగు సినిమాకు హైలెట్ అయింది.
ధూమ్ చిత్రం మొదటి సిరీస్‌లోని ‘ధూమ్ మచాలే..' సాంగులో ఇషా డియోల్ బికినీలో దర్శనమిచ్చి అందరి మతులు పోగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ముందుగానీ, ఆ సినిమా తర్వాత గానీ ఇషా డియోల్ మళ్లీ అలాంటి హట్ అప్పియరెన్స్ ఇవ్వలేదు. ఆమె అందాల ఆరబోత అప్పట్లో సినిమాకు హైలెట్ అయింది.
ఇక ధూమ్-2 చిత్రంలో ఐశ్వర్యరాయ్, బిపాసా బసు తమ అందాలతో మతి పోగొట్టారు. ధూమ్-2 సినిమాకు ఐశ్వర్యరాయ్ అందాలు, పెర్ఫార్మెన్స్, హృతిక్ రోషన్ చేసిన సాహసాలు సినిమాకు హైలెట్‌గా మారాయి. ఈ సారి ‘ధూమ్-3' చిత్రంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్.
ఇషా డియోల్
ధూమ్ చిత్రంలో ఇషా డియోల్ అప్పట్లో బికినీలో హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చి అందరి మతులు పోగొట్టింది. ఈ చిత్రంలో ఇషా డియోల్ ఉదయ్ చోప్రా సరసన నటించింది. ఇద్దరి మధ్య ఈ చిత్రంలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
ఐశ్వర్యరాయ్
ధూమ్-2 చిత్రంలో నటించిన ఐశ్వర్యరాయ్ సన్నజాజితీగలా మారి తన పెర్ఫార్మెన్స్తో అందరి మతి పోగొట్టింది. ఈ చిత్రంలో హృతిక్, ఐశ్వర్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
బిపాసా బసు
ధూమ్-2 చిత్రంలో బిపాసా బసు కూడా తన అందాలతో అందరి మతుల పోగొట్టింది. ఈ చిత్రంలో ఆమె ఉదయ్ చోప్రాకు జోడీగా నటించింది.
రిమి సేన్
ధూమ్-2 చిత్రంలో నటించిన మరో భామ రిమిసేన్. ఈ చిత్రంలో ఆమె అభిషేక్ బచ్చన్‌కు జోడీగా నటించింది.
కత్రినా కైఫ్
ఇపుడు ధూమ్-3 చిత్రంతో కత్రినా కైఫ్ తన అందాల ప్రదర్శనతో పాటు, సాహస విన్యాసాలతో ఆకట్టుకుంది.