అదిరాయండోయ్...! (క్రిష్-3 రేర్ ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : హృతిక్ రోషన్ హీరోగా రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్రిష్ 3'. హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం.

గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన వివరాలతో పాటు, ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం......

కండలు పెంచిన హృతిక్

కండలు పెంచిన హృతిక్

క్రిష్ 3 చిత్రం కోసం హృతిక్ రోషన్ ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. గతంలోనూ పలు చిత్రాల్లో హృతిక్ భారీగా కండలు ప్రదర్శించాడు. అయితే ఈ చిత్రంలో ఇంకాస్త డిఫరెంటుగా కనిపించనున్నాడు.

కంగన డిఫరెంట్ లుక్

కంగన డిఫరెంట్ లుక్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ చిత్రంలో డిఫరెంటు లుక్ కనిపించబోతోంది. ఆమె ఇందులో డిఫరెంటు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన లుక్ పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేసారు. మెటల్‌తో తయారు చేయడంతో దాని బరువు 28 కేజీలకు చేరిందట.

రొమాంటిక్ కెమిస్ట్రీ

రొమాంటిక్ కెమిస్ట్రీ

ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ మధ్య జరిగే రొమాంటిక్ కెమిస్ట్రీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

హృతిక్ రోషన్ డిఫరెంటు గెటప్స్

హృతిక్ రోషన్ డిఫరెంటు గెటప్స్

ఈ చిత్రంలో హృతిక్ రోషన్ డిఫరెంటు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన క్రిష్ సీక్వెల్స్ లానే ఈచిత్రం కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టెన్ చేయనుంది.

జిమ్‌లో హృతిక్

జిమ్‌లో హృతిక్

క్రిష్ 3 చిత్రం కోసం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ హృతిక్ రోషన్ ఇలా దర్శనం ఇచ్చారు.

కంగనా రనౌత్

కంగనా రనౌత్

హీరోయిన్ కంగనా రనౌత్ ఈచిత్రంలో అందాలతో ఆకట్టుకోవడంతో పాటు....ఒళ్లు గగుర్బొడిచే సాహసాలు చేస్తూ అభిమానులను ఆకట్టకోనుంది.

స్పందన అమోఘం

స్పందన అమోఘం

క్రిష్-3 ఫస్ట్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెల 5న విడుదలైన ట్రైలర్ పది రోజుల్లో 1 కోటి 20 లక్షలకు పైగా హిట్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ చాలా బాగుందనే టాక్ రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

దీపావళికి

దీపావళికి

దీపావళి పండుగ సందర్భంగా బాలీవుడ్‌లో విడుదలయ్యే చిత్రాలపైన దృష్టి పెడతారు సినీ ప్రేక్షకులు. ఈ సమయంలో వెండితెరపైన అలరించే చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోవడంతో పాటు సంచలన విజయాలను సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపించడమే దీనికి కారణం. క్రిష్ 3 చిత్రం కూడా దీపావళికి విడుదలవుతోంది.

హాలీవుడ్ రేంజిలో

హాలీవుడ్ రేంజిలో

ఈ చిత్రంలోని కథతోపాటు గ్రాఫిక్స్‌, కాస్ట్యూమ్స్‌, పోరాట సన్నివేశాలు కూడా హాలీవుడ్‌ స్ధాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నాడు రాకేష్‌ రోషన్‌.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X