twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘s/o సత్యమూర్తి’ గురించి ఆసక్తికర విషయాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రేపు(ఏప్రిల్ 9) విడుదలవుతున్న ‘s/o సత్యమూర్తి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో ‘జులాయి' సినిమా రావడం, బన్నీ ‘రేసు గుర్రం', త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది' చిత్రంతో జోరు మీద ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

    సినిమా ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటూ ముందు నుండి చెబుతూ వస్తున్నారు. ట్రైలర్, టైటిల్ కూడా దాన్ని రిఫ్లక్ట్ చేసే విధంగా ఉండటంతో ఈ చిత్రంపై ఇటు ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. మరో వైపు ఈ సినిమా కథ లీకైందంటూ రకరకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటికీ సినిమా విడుదలతో తెర పడనుంది.

    స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు....

    బ్రహ్మానందం

    బ్రహ్మానందం

    సినిమాలో బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే విధంగా ఉండనుంది. గత సినిమాల్లోనే ఈ సినిమాలోనూ ఆయన కామెడీ అదరగొడతారని అంటున్నారు.

     ఉపేంద్ర

    ఉపేంద్ర

    ట్రైలర్ చూస్తుంటే...ఈ చిత్రంలో ఉపేంద్ర చనిపోతాడని తెలుస్తోంది. నిజంగానే చనిపోతాడో? లేక బ్రహ్మీ, ఉపేంద్ర మధ్య ఇది ఏమైనా రివేంజ్ లాంటి డ్రామానా? అనేది రేపు తేలనుంది.

    నిత్య మీనన్ అల్లు అర్జున్

    నిత్య మీనన్ అల్లు అర్జున్

    ట్రైలర్లో అల్లు అర్జున్ అలీకి సిగ్నల్ ఇస్తున్నట్లు ఉంది. దీన్ని బట్టి ఏదో పని కోసం నిత్యా మీనన్ ను ట్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    సత్యమూర్తి-ప్రకాష్ రాజ్

    సత్యమూర్తి-ప్రకాష్ రాజ్

    సినిమాలో సత్యమూర్తి ఎవరు? అనేది ఇప్పటి వరకు చూపలేదు. అయితే అతను మరెవరో కాదు...ప్రకాష్ రాజే అని బ్యాగ్రౌండులో ఉన్న ఫోటో బట్టి తెలుస్తోంది. వెన్నెల కిషోర్ మరొక కొడుకుగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

    అల్లు అర్జున్ నారేషన్

    అల్లు అర్జున్ నారేషన్

    ట్రైలర్ ను పరిశీలిస్తే....సన్నాఫ్ సత్యమూర్తి సినిమా విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్) చెప్పే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆధారంగా రన్ అవుతుందని స్పష్టమవుతోంది.

    నిత్యా మీనన్

    నిత్యా మీనన్

    సినిమాలో నిత్యా మీనన్ సెకండాఫ్ లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.

    కృష్ణ చైతన్యతో కనెక్షన్

    కృష్ణ చైతన్యతో కనెక్షన్

    కృష్ణ చైతన్య పాత్ర ఏమిటనేది ఇంకా తెలియలేదు. సినిమాలో అతనేదో సమస్యలో పడతాడని స్పష్టమవుతోంది.

    నిత్యా మీనన్

    నిత్యా మీనన్

    నిత్యా మీనన్ ఈ చిత్రంలో ఉపేంద్ర చెల్లి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఉపేంద్ర వైఫ్ పాత్రలో స్నేహ నటిస్తోంది.

    అల్లు అర్జున్ రిచ్ టు పూర్

    అల్లు అర్జున్ రిచ్ టు పూర్

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ ధన వంతుడి నుండి పేద వాడిగా మారుతాడని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X