»   » ‘టాక్సీవాలా’ యావరేజ్ అంటగా?.... రియాల్టీ వివరించిన విజయ్ దేవరకొండ!

‘టాక్సీవాలా’ యావరేజ్ అంటగా?.... రియాల్టీ వివరించిన విజయ్ దేవరకొండ!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' నవంబర్ 17న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇది విజయ్ గత చిత్రం 'గీత గోవిందం' కంటే ముందే థియేటర్లోకి రావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

    నేను చేస్తున్నవన్నీ ఛీప్ థ్రిల్స్.. కరణ్ జోహార్ ఇంట్లో కూర్చున్నప్పుడు.. విజయ్ దేవరకొండ!


    అప్పట్లో 'గీత గోవిందం' సినిమా విడుదల సమయంలో లీక్స్ జరిగినపుడే 'టాక్సావాలా' మొత్తం మూవీ బయటకు లీకైనట్లు ప్రచారం జరిగింది. ఈ మూవీని మొబైల్స్‌లో చూసిన వారు యారేజ్ అనే టాక్ స్ప్రెడ్ చేశారు. బొమ్మ బోల్తా పడేట్లు ఉంది కాబట్టే... దీన్ని ఆపేసి 'గీత గోవిందం' రిలీజ్ చేశారనే వాదన సైతం ఉంది.


    యావరేజ్ అనే వారికి ఇదే సమాధానం..

    యావరేజ్ అనే వారికి ఇదే సమాధానం..

    ‘టాక్సీవాలా' సినిమాపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొట్టి పారేసేందుకు.... అసలు రియాల్టీ ఏమిటనేది వివరించేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, కొందరు పిల్లలతో కలిసి ఈ సినిమాపై జనాల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.


    చెప్పాగా ఇంకా పూర్తి కాలేదు...

    లీకైన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికాని ప్రింట్. అది చూస్తే ఎవరికైనా రుచి పని లేనట్లు ఉంటుంది.... అంటూ ఇంకా వండటం పూర్తికాన్ని పాస్తా వంటకాన్ని ఉదాహరణగా చూపిస్తూ విజయ్ ఈ వీడియోలో రియాల్టీ వివరించే ప్రయత్నం చేశారు.


    టాక్సీవాలా

    టాక్సీవాలా

    టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ద్వారా ప్రియాంక జవాల్కర్ అనే కొత్త బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. టాక్సీ‌వాలాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, సైన్స్ ఫిక్షన్స్, థ్రిల్లర్, కామెడీ చాలా ఉన్నాయి. నా కెరీర్లో డిఫరెంట్ మూవీ. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, ఈ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను అని విజయ్ దేవరకొండ గతంలో ఓ సందర్భంలో తెలిపారు.


     నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్

    విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల, సౌండ్ - సింక్ సినిమా, స్టంట్స్ - జాషువా, ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి, లిరిక్స్ - కృష్ణ కాంత్, మ్యూజిక్ - జేక్స్ బిజాయ్, ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్, సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి, నిర్మాత - ఎస్ కె ఎన్, ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 , యువి పిక్చర్స్, స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్.


    English summary
    Check out video of The Reality Behind Taxiwaala. Starring Vijay Deverakonda, Priyanka Jawalkar and Malavika Nair. Music by Jakes Bejoy. Directed by Rahul Sankrityan. Produced by SKN Under the Banner of UV Creations & GA2 Pictures.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more