కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ ట్రైలర్ వస్తోంది
హైదరాబాద్: కమల్‌హాసన్, త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చీకటి రాజ్యం'. ఎన్.చంద్రహాసన్ నిర్మాత, రాజేష్ ఎం.సెల్వన్ దర్శకుడు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ సెప్టెంబర్ 16న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, కిషోర్, సంపత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కమల్ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
ఆ మధ్య షూటింగ్ పూర్తయిన సందర్భంగా కమల్ మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. నాలుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు తమని తాము మర్చిపోయి సినిమాలో లీనమైపోతారు. గిబ్రాన్ మంచి సంగీతం అందించాడు''అని తెలిపారు.

నా గురువు బాలచందర్‌గారితో 37 సినిమాలకు కలిసి పని చేశాను. చివరి సినిమా 'ఉత్తమవిలన్' చేశాక ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన లక్షణాలు నాలో కొన్ని కనిపిస్తున్నాయి. నా కోపం, నటన అన్నీ బాలచందర్‌గారి నుంచి వచ్చినవే. 'చీకటి రాజ్యం' ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారు. సినిమా అనేది ఎవరి కారణంగా విజయం సాధిస్తుందో చెప్పలేం. 'షోలే'లో అందరికీ గబ్బర్‌సింగ్ పాత్రే గుర్తుంటుంది. అలా ఏ సినిమాతో ఎవరికి గుర్తింపు లభిస్తుందో తెలియది''అన్నారు.
ఈ చిత్రం Sleepless Night (2011) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. గతంలోనూ కమల్ చిత్రాలు రకరకాల పరభాషా చిత్రాల నుంచి ప్రేరణ పొందినవి కావటంతో ఇదే నిజమే కావచ్చుననే అంటున్నారు.


Click it and Unblock the Notifications











