రూ. 33.12 కోట్లు : ఫస్ట్‌డే కలెక్షన్ రికార్డ్ బద్దలు
ముంబై : షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా రూపొందిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో పాత రికార్డులను తిరగరాసి సరికొత్త రికార్డులను సృష్టించింది. బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేయిడ్ ప్రివ్యూలను వేయడం సినిమాకు బాగా కలిసొచ్చింది.
బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పేయిడ్ ప్రివ్యూల నుంచి రూ. 6.75 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. అదే విధంగా తొలి రోజు మొత్తం కలెక్షన్స్ రూ. 33.12 కోట్లు వసూలయ్యాయి. మొత్తం వసూళ్లు రూ. 39.87 కోట్లుగా నమోదయ్యాయి. ఈ గణాంకాలతో 'చెన్నై ఎక్స్ ప్రెస్' మూవీ సరికొత్త రికార్డు నమోదు చేసింది.
గతంలో అమీర్ ఖాన్ నటించిన '3 ఇడియట్స్' మూవీ అత్యధికంగా పేయిడ్ ప్రివ్యూల ద్వారా రూ. 2.75 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా సల్మాన్ ఖాన్ నటించిన 'ఏక్తా టైగర్' చిత్రం తొలి రోజు రూ. 32.19 కోట్లు వసూలు చేసింది. తాజాగా 'చెన్నై ఎక్స్ ప్రెస్' మూవీ ఈ రెండు రికార్డులను బద్దలు కొట్టింది.
సినిమా వినోదాత్మకంగా ఉందనే టాక్ రావడంతో కలెక్షన్ల సూపర్‌గా ఉంటాయని నిర్మాతలు భావిస్తున్నారు. వీకెండ్ కావడంతో తొలి 4 లేదా 5 రోజుల్లో రూ. 100 కోట్ల మార్కు దాటుతుందని భావిస్తున్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications












