చెన్నై ప్రజల గురించి 'అమితాబ్' ట్విట్టర్‌లో... !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 5 ప్రారంభోత్సవ ఉత్సవం కోసం సిద్దమైన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ చెన్నై తనకి రెండవ ఇల్లుగా అభివర్ణించాడు. ప్రస్తుతం ఉన్న చెన్నై ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. 69 సంవత్సరాల వయసు కలిగిన అమితాబ్ ప్రసూన్ జోషి రాసిన పద్యానికి మంగళవారం రాత్రి నర్తించనున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. చెన్నైలో నేను చాలా సినిమాలు చేయడం జరిగింది. ఇక్కడి జనాభా దయ, క్రమశిక్షణ, అణుకువ కలిగిన వారని ట్వీట్ చేశాడు. 1970లలో ఉన్న చెన్నైకి ఇప్పుడున్న చెన్నైకి అభివృద్ది, గ్రేట్ మేనేజ్‌మెంట్, సుపిరియర్ టెక్నాలజీ, ఫిల్మ్ మేకింగ్ లాంటి విషయాలలో అభివృద్ది చెందిందని ఆ తర్వాత ట్వీట్ చేశాడు.
ఐపిఎల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమితాబ్‌తో పాటు హాలీవుడ్ పాప్ సింగ్ కాటి పెర్రీ అధ్బుత ఫెర్పామెన్స్ ఇవ్వనుంది. వీరితో పాటు ఇండియన్ డ్యాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్ లాంటి మహామహులు నృత్యం చేయనున్నారు.


Click it and Unblock the Notifications











