శర్వానంద్ పెళ్లికి చెర్రీ వేట... చిన్ననాటి స్నేహితురాలేనట!
వరుసగా టాలీవుడ్ కుర్ర హీరోలంతా పెళ్లి పీటలెక్కేస్తున్నాడు. ఈ మధ్యే నిఖిల్, నితిన్, రానా ఒకరి తరువాత మరొకరు పెళ్లాడేసి తమ జీవితంలోకి నవ వసంతాన్ని ఆహ్వానించారు. ఇప్పుడు వీరి స్ఫూర్తితో మరో డాషింగ్ హీరో శర్వానంద్ కూడా ఏడడుగులు వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు.
త్వరలోనే పెళ్లాడేయాలని ఫిక్స్ అయిన శ్వరా, చిన్ననాటి స్నేహితురాలినే వరించాలని భావిస్తున్నాడు. ఇటీవలే తన తల్లిదండ్రులకూ విషయం చెప్పిన ఈ హ్యాండ్సమ్ హీరో వారితో కూడా ఓకే అనిపించేసుకున్నాడు. త్వరలోనే అమ్మాయికి, పెళ్లికి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా వెల్లడించనున్నాడు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది చివరకు మూడు ముళ్ల బంధంలోకి ఎంటరవ్వాలని భావిస్తున్నాడట శర్వా.

అయితే శర్వానంద్ పెళ్లికి అసలు సూత్రధారి వేరే ఉన్నాడని తెలుస్తోంది. అది మరెవరో కాదు శర్వా చిన్ననాటి స్నేహితుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇకపోతే, చిన్ననాటి స్నేహితురాలితో అబ్బాయికి ముడివేయడం వెనుక చెర్రీ హస్తమే ఉందని తెలుస్తోంది. అమ్మాయి, చెర్రీ భార్యామణి ఉపాసనకు దూరపు బంధువు కావడం మరో విశేషం. ఇక మజిలీలో సమతం లాంటి భార్య కావాలంటూ మనసులోని మాటను బయటపెట్టిన శర్వాకు అచ్చం అలాంటి అమ్మాయే దొరికిందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











