క్రీడలపై చెర్రీ గురి... కథ దొరికితే రఫ్పాడించేందుకు రెడీ....

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని మార్కులైయితే వేయించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద స్టడీగా కొనసాగుతూ స్టార్ డమ్ ను కైవసం చేసుకున్నాడు. సినీ నిర్మాణంలోనూ అడుగుపెట్టి మంచి ఫలితాలను అందుకుంటున్నాడు. అయితే, అబ్బాయికి మాత్రం ఇంకా సంతృప్తిగా అనిపించడంలేదట. అందుకే నటనలో మరింతగా దూసుకుపోవాలని తాపత్రయపడుతున్నాడు చెర్రీ.

ప్రస్తుతం RRRలో నటిస్తున్న చెర్రీ, ఆ తరువాత మెగాస్టార్ నాన్నతో ఆచార్యను కూడా సిద్ధం చేసేస్తున్నాడు. వచ్చే ఏడాది మొత్తం అబ్బాయికి ఈ ప్రాజెక్ట్ లతోనే సరిపోతుంది. అయితే ఇంత హడావిడిలోనూ తనలోని నటుడిని సంతృప్తి పరిచేందుకు ఓ స్పోర్ట్స్ బేస్ట్ మూవీ చేయాలనుకుంటున్నాడట చెర్రీ. ఈ విషయాన్ని అబ్బాయే స్వయంగా వెల్లడించాడు.

Cherry wants to sweat it out, Wants a sports based film.

క్రీడా నేపథ్యంలో ఓ వైవిధ్యమైన సినిమా చేయాలని తాపత్రయ పడుతున్న చెర్రీ, ఈ మేరకు కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. తమిళ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో మెరుపు అనే సినిమాకు సంతకం చేశాడు. ఆర్బీ చౌదరి సారధ్యంలో కాజల్ హీరోయిన్ గా పట్టాలెక్కిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల కొంతకాలానికే అగిపోయింది. ఆ తరువాత మళ్లీ చెర్రీకి మళ్లీ అలాంటి కథ దొరకలేదు.

అయితే ఆ సినిమా పట్టాలెక్కకపోయినా, అలాంటి దమ్మున్న కథ కోసమే చెర్రీ ఎదురుచూస్తున్నాడట. కథ నచ్చితే సొంత నిర్మాణంలోనూ ముందుకు వెళ్లేట్టే కనిపిస్తున్నాడు మన మెగాపవర్ స్టార్. మరి రైటర్లు ఈ మేరకు ఏమన్నా తమ పెన్నులకు పదును పెడతారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X